YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సంక్షోభంలోనూ పేదలకు బాసటగా తెలంగాణ ప్రభుత్వం.. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి

సంక్షోభంలోనూ పేదలకు బాసటగా తెలంగాణ ప్రభుత్వం.. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..  మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి

జగిత్యాల మే 10
సంక్షోభం లోనూ ప్రజలందరికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని దానికి సీఎం కేసీఆర్ నిర్వీరమంగా కృషి చేస్తున్నారని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక వర్తక సంఘ భవనంలో 46 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను  శ్రావణి అందజేశారు. ఈసందర్బంగా  చైర్ పర్సన్ శ్రావణి మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ప్రభావం  అధికంగా ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, స్వీయనియంత్రనా పాటించాలని సూచించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.  తనకు, తన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని, కరోనా విషయంలో భయపడాల్సిందేమి లేదన్నారు. స్వీయ నియంత్రనే శ్రీరామ రక్ష అని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కరోనా కట్టడికి తోడ్పాటును అందించాలని కోరారు.   జగిత్యాల పట్టణ అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండా గా పాలకవర్గం పనిచేస్తుందని, ఆ దిశగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సహకారంతో ముందుకు వెళ్తున్నామని చైర్ పర్సన్ శ్రావణి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ కప్పల శ్రీకాంత్, పిట్ట ధర్మరాజు, కూతురు రాజేష్, కూసరి అనిల్, చుక్క నవీన్, జిల్లా టీఆరెస్ యువజన విభాగం అధ్యక్షులు దావ సురేష్ తో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Related Posts