YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రంజాన్ కానుకలు పంపిణీ చేసిన కౌన్సిలర్ రాము నాయక్

రంజాన్ కానుకలు పంపిణీ చేసిన కౌన్సిలర్ రాము నాయక్

బెల్లంపల్లి మే 10
రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలను ఆదుకోవాలని  సిఎం కేసీఆర్, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముస్లీంలకు రంజాన్ కానుకలు పేద మస్లీం యువతులు వివాహాలకు షాదిముబారక్ పథకాలు  అందచేస్తున్నారు
 బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు సోమవారం    కౌన్సిలర్ రాము నాయక్ సోమవారం  9వ వార్డులోని రడగoబాలా బస్తీలో, రంజాన్ కానుకను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముస్లీంలకు రంజాన్ పండుగ సందర్భంగా  కానుకలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ది అని అన్నారు మస్లీలంతా రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు. తెలంగాణ ముస్లిం మైనార్టీలకు అండగా భరోసా ప్రభుత్వం నిలుస్తోందన్నారు.
పేద ముస్లీం వివాహాలకు వారి తల్లిదండ్రులకు బారం కావద్దని షాధిముభారక్ పథకం అమలు చేసి పేద మస్లీం కుటుంబాల్లో ముఖాల్లో అనందం నింపుతున్నారు
ముస్లీం పేద విద్యార్ధుల విద్యాబోధన కోసం రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ గురుకుల పాఠశాలను నెలకొల్పి ఉచింతగా విద్యను అందిస్తున్నారు ప్రతి విద్యార్ధికి సంవత్సరం కాలం విద్యాబోధన కోసం 1లక్ష 25వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తుందన్నారు. 70ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు ఏనాడు మస్లీం సంక్షేమం చూడలేదని, సీఎం కేసీఆర్  ముస్లీం సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నారన్నారు. బెల్లంపల్లి నియోజవర్గంలోని గౌరవ ఎమ్మెల్యే  ముస్లీంల అభివృద్ధి కోసం కృషి  చేస్తారనితెలిపారు,. ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్  నాయకులు, పాషా.స్థానిక నాయకులు కార్యకర్తలు . లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts