YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఇండిగో విమాన సంస్థకు ఆదిత్య ఘోష్ రాజీనామా

ఇండిగో విమాన సంస్థకు ఆదిత్య ఘోష్ రాజీనామా

బడ్జెట్ క్యారియర్‌‌గా పేరు తెచ్చుకున్న ఇండిగో విమాన సంస్థకు ఆదిత్య ఘోష్ అనూహ్యంగా రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం బోర్డు సమావేశం ముగిసిన తర్వాత ప్రెసిడెంట్, హోల్‌టైమ్ డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసినట్లు ఇండిగో యాజమాన్య సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ప్రకటించింది. ప్రెసిడెంట్‌గా జూలై 31 నుంచి ఆయన రాజీనామా అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ నెల 26నుంచి డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు వెల్లడించింది.2007మే 30న ఆదిత్య ఘోష్ ఇండిగో బోర్డులో చేరారు. 2008 నుంచి ఇండిగో సంస్థకు పదేళ్ల పాటు విశేష సేవలు అందించారు. కాగా ఘోష్‌గానీ, కంపెనీ యాజమాన్యం గానీ ఆయన రాజీనామాకు గల కారణాలను వెల్లడించలేదు. త్వరలో ఆదిత్య ఘోష్ కొత్త వెంచర్, ప్రారంభించే ఉద్దేశ్యంతోనే ఇండిగో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం. ఆదిత్య స్థానంలో విమానరంగ ప్రముఖుడు గ్రెగరీ టేలర్‌కు చైర్మన్, సీఈవో బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఇండిగోతో పాటు యూఎస్ ఎయిర్‌వేస్‌లో పనిచేసిన ఆయన... తొలుత ఇండిగో సీనియర్ సలహాదారుగా చేరనున్నారు. కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ భాటియా తాత్కాలిక చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఓ) డైరెక్టర్‌గా వ్యవహరించనున్నట్లు ఇండిగో ప్రకటించింది. ఇటీవల విమానాల్లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక లోపాలు, ప్రయాణికుల పట్ల సిబ్బంది దురుసు ప్రవర్తనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే ఆదిత్య ఘోష్ తప్పుకోవడం గమనార్హం.

Related Posts