YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సమయం కోసం నిరీక్షణ

సమయం కోసం నిరీక్షణ

చెన్నై, మే 11, 
తమిళనాట రాజకీయాలు ఎన్నికల ఫలితాల తర్వాత శరవేగంగా మారననున్నాయి. మాజీ అన్నాడీఎంకే నేత శశికళ వైపే ఇప్పుడు అందరి చూపూ ఉంది. అన్నాడీఎంకే పగ్గాలను తిరిగి చేపట్టేందుకే శశికళ ఉత్సాహం చూపుతున్నారని చెబుతున్నారు. శశికళ అడుగులు కూడా ఆ దిశగానే పయనిస్తున్నాయి. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు శశికళ ఎన్నికలకు ముందే ప్రకటించారు. అయితే అన్నాడీఎంకేకే ఓటు వేయాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అన్నాడీఎంకేలో ఇంకా శశికళ వర్గం ఉంది. శశికళ వర్గంగా అనుమానించిన వారికి పళనిస్వామి ఈసారి టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించారు. అయినా కొందరు శశికళతో టచ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాత అన్నాడీఎంకే నేతలు అనేక మంది శశికళతో టచ్ లోకి వెళ్లారంటున్నారు. అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టాల్సిందిగా శశికళను వారు కోరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.శశికళ మాత్రం ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఎలాగా ఉన్నా న్యాయ పోరాటం ద్వారానే తాను తిరిగి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాలన్నది ఆమె ఉద్దేశ్యంగా ఉంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం చేతుల్లో పార్టీ ఉంటే రాజకీయంగా తమకు భవిష్యత్ లేదని ఇప్పటికే కొందరు డిసైడ్ అయ్యారు. అటు అన్నాడీఎంకేలో ఉండలేక, ఇటు డీఎంకేలో చోటు లేక అనేక మంది నేతలు శశికళ కోసమే ఎదురు చూస్తున్నారు.శశికళ కూడా సమయం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. 2017లో తనను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడంపై శశికళ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. దినకరన్ ఈ కేసు నుంచి తప్పుకున్నా శశికళ మాత్రం న్యాయస్థానం ద్వారానే తిరిగి పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఈలోపు అన్నాడీఎంకే నుంచి నేతల సహకారం కూడా తనకు లభిస్తుందని శశికళ భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి

Related Posts