YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈటల అష్గదిగ్భంధనం...

ఈటల అష్గదిగ్భంధనం...

కరీంనగర్, మే 11, 
మాజీ మంత్రి ఈటెల ఎవ్వారం బ‌య‌టికి వ‌చ్చాక‌. ఆయ‌న‌కి వేల కోట్లు ల‌క్ష‌ల కోట్లు లేవు. ఉండ‌క పోవ‌చ్చు అనే విష‌యం అర్దం అవుతోంది. అఫ్ కోర్స్.. కోళ్ల ఫార‌మ్స్ బిజినెస్ లు పెద్ద‌వే కావ‌చ్చు. కానీ.. మ‌రీ వేల కోట్లు అప్ప‌నంగా  వెన‌కేసి ఉండ‌క పోవచ్చు. కాక‌పోతే.. ఆర్థికంగా ఒక మినిస్ట‌ర్ గా బ‌లంగానే ఉండొచ్చు అనే క్లారిటీ  క‌నిపిస్తోంది. కానీ.. మ‌రి ఈటెల రాజేంద‌ర్ పార్టీ పెడ‌తారు అనే టాక్ వ‌స్తోంది. మ‌రి సీఎం కేసీఆర్ ఊరుకుంటారా చెప్పండి. ఆయ‌న గిల్లితే గిల్లించుకోవాలి అనే టైప్ అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే క‌దా. నేను గిల్లించుకునే టైప్ కాదు కాబ‌ట్టే.. రెబ‌ల్ మారిపోయా అంటున్నారు ఈటెల రాజేంద‌ర్. ప‌ద‌వుల కోసం త‌లొగ్గే మ‌నిషినైతే.. ఇంత దాకా ఎందుకు వ‌స్తుంది. నాకు ఆత్మాభిమానం ఎక్కువ అంటున్నారు. ఇదంతా ఓకే. పార్టీ పెట్టాలి అంటే ఊరికే ఉందా ఎవ్వారం. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిస్థితి ఏమైందో తెలుసు క‌దా. డ‌బ్బుల్లేవు.. డ‌బ్బుల్లేవు అంటుంటారు. ఇటు ష‌ర్మిల పార్టీ పెడుతున్నారు అంటే.. డ‌బ్బుల గురించి ఎవ్వ‌రూ ఆలోచించ‌రు. ఎందుకంటే ఆమె జ‌గ‌న్ చెల్లి కావ‌డంతో.. ఆర్థికంగా వారి రేంజ్ ఏంటో అంద‌రికీ తెలిసిందే. అయితే.. కొండా విశ్వేశ్వ‌ర రెడ్డి, రేవంత్ రెడ్డి, హ‌రీశ్ రావులు ఫుల్ స‌పోర్ట్ ఇచ్చి.. మేము మీ వెన‌కాలే ఉంటాం అంటే.. ఆ ఎవ్వారం వేరే ఉంటుంది. కానీ... హ‌రీశ్ వ‌స్తారా లేరా అనేది క్లారిటీ లేదు. మ‌రి రేవంత్ రెడ్డి అధ్య‌క్షుడుగా ఉండాలి, సీఎం క్యాండిడేట్ అయ్యి ఉండాలి. ఈటెల పార్టీ పెడితే.. ఈయ‌నే మెయిన్ గా ఉంటే.. రేవంత్ వెన‌కాల నుంచోడానికి రెడీనా కాదా అన్న‌ది క్లారిటీ లేదు. సో.. రేవంత్ స‌పోర్ట్ ఎంత‌గ‌నం దొరుకుతుంది అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ పాయింటే.ఇది  ఇలా ఉంటే.. ఈ గ్యాప్ లోనే ఈటెల‌ను వీక్ చేయాలి అనే ప్లాన్ లో ఉన్నార‌ట సీఎం కేసీఆర్. ఆల్రెడీ.. ఈటెల నియోజ‌క వ‌ర్గం అయిన హుజూరాబాద్ ఇంచార్జ్ గా వేరే వారికి బాధ్య‌త‌లు అప్ప‌జెప్పార‌ట కూడా. ఇక పోతే.. ఈటెల‌కి స‌పోర్ట్ చేసే అధికారుల్ని ట్రాన్స్ ఫ‌ర్లు కూడా చేశారట‌.  ఇక టీఆర్ఎస్ స్థానిక లీడ‌ర్ల‌ని కూడా కంట్రోల్ చేశార‌ట‌. తొలి రోజు వెన‌కాల న‌డిచిన వారిలో స‌గం మందిని వెన‌క నుంచి వెన‌క్కే లాగేశార‌ట‌. ఇప్పుడు ఈటెల‌తో పాటు.. ఆయ‌న‌కి క్లోజ్ గా ఉండే అనుచ‌ర వ‌ర్గం మాత్ర‌మే స‌పోర్టింగ్ గా ఉందంట‌. ఈ టైంలో.. ఈటెల ఏం చేయ‌బోతున్నారు అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ గా మారింది. ఒంటరి పోరాటం త‌ప్ప‌దేమో అంటున్నారు.

Related Posts