న్యూ ఢిల్లీ మే 11
బెంగాల్ లో జరిగిన హింసకు వ్యతిరేకంగా గ్లోబల్ ప్రొటెస్ట్ ఆధ్వర్యములో5 ఖండాలలొ, 30 దేశాలలొ, 50 నగరాలలొ భారీ నిరసన ర్యాలీలు నిర్బ్వహించారు,ఈ సందర్బంగా బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రవాస భారతీయులు డిమాండ్ చేసారు.అందులో భాగముగా అమెరికాలో - న్యూ యార్క్ లో టైం స్క్వేర్ వద్ద , న్యూ జెర్సీ లో ఎడిసన్ నగరము , అట్లాంటా రాష్ట్రము , టెక్సాస్ రాష్ట్రము లో డల్లస్ , హౌస్టన్, వాషింగ్ టౌన్ డీసీ , కాలిఫోర్నియా లో మిల్ పీటస్, శాన్ ఫ్రాన్స్ సిస్కో , లాస్ ఏంజెల్స్ , నార్త్ కరోలినా, విస్కోన్ సిన్ లో మాడిసన్ , చికాగో , న్యూ యార్క్ లో బాటరీ పార్క్ వద్ద , ఇంకా పలు రాష్ట్రాలలో నిరసనలు చేసారు,పశ్చిమ్ బెంగాల్‌లో పెద్దయెత్తున హింస చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనల్లో చాల మృతి చెందారు, సుమారు 4 వేల మంది హిందువుల ఇల్లు ధ్వంసం అయ్యాయి . ఇది అంత మమతా బెనర్జీ కి సంబందించిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడులు వల్ల ఇలా జరిగింది, దినికి నైతిక బాధ్యత వహించాలి అంటూ , మమతా ఈ హింసను ఆపాలంటూ , ప్రవాస భారతీయులు డిమాండ్ చేసారు.