YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కింగ్ నాగార్జున రిలీజ్ చేసిన మంచు లక్ష్మి ‘‘వైఫ్ ఆఫ్ రామ్’’ టీజర్

కింగ్ నాగార్జున రిలీజ్ చేసిన మంచు లక్ష్మి  ‘‘వైఫ్ ఆఫ్ రామ్’’ టీజర్

ఇన్నోవేటివ్  థాట్స్ ను ఇంటెలిజెంట్ గా ప్రజెంట్ చేయడం నేటి దర్శకుల స్టైల్. ఏం చెప్పినా కొత్తగా చెప్పాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలున్న కథే ‘వైఫ్ ఆఫ్ రామ్’. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీ టీజర్ ను అక్కినేని నాగార్జున ట్విట్టర్ ద్వారాగా విడుదల చేశారు. టీజర్ చూసిన వెంటనే నాగ్ ఒక్కసారిగా సర్ ప్రైజ్ అయ్యారు. క్షణంక్షణం ఉత్కంఠను రేకెత్తించేలా ఉందన్నాడు. టీజర్ చూస్తే సినిమా ఎప్పుడు చూడాలా అన్న ఉత్సుకత పెరిగిపోయిందని, మంచు లక్ష్మి చేసిన ఈ ప్రయత్నం అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాడు. రెగ్యులర్ ఫార్మాట్ కు భిన్నంగా, టీజర్ లో ప్రతి ఫ్రేమ్ ఇంట్రెస్టింగ్ గా ఉందని.. తనకైతే ఈ ‘వైఫ్ ఆఫ్ రామ్’ టీజర్ విపరీతంగా నచ్చిందని చెప్పారు. 

 రాజమౌళి వద్ద ‘ఈగ’, ‘బాహుబలి-1’ చిత్రాలకు అసిస్టెంట్ గా పనిచేసిన విజయ్ యలకంటి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. మానవ సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. రామ్ ను పై నుంచి తోసేసి చంపేశారు అన్న మంచు లక్ష్మి డైలాగ్ తో మొదలై..  ఈ సైకలాజికల్ థ్రిల్లర్ గురించి దర్శకుడు విజయ్ యలకంటి మాట్లాడుతూ ‘‘ ఇది న్యూ ఏజ్ సినిమా. రెగ్యులర్ థ్రిల్లర్స్ లా కాకుండా.. ఈ థ్రిల్లర్ కు ఫ్యామిలీ అనుబంధాల్ని కూడా జోడించాం. వైఫ్ ఆఫ్ రామ్ గా మంచు లక్ష్మి కెరీర్ లోనే ఇది బెస్ట్ గా నిలిచే పాత్ర అవుతుంది. ప్రతి క్షణం ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేసే అంశాలు చాలా ఉంటాయి. ఊహించని ట్విస్ట్ లతో సాగే ఈ కథ, కథనం ఖచ్చితంగా చూసే ప్రతి ఒక్కరికీ సరికొత్త అనుభూతినిస్తుంది’’ అన్నాడు. 

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీని.. కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మంచు లక్ష్మి టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘వైఫ్ ఆఫ్ రామ్’లో సమ్రాట్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.. సాంకేతిక నిపుణులు.. ఎడిటర్ : తమ్మిరాజు,  డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సామల భార్గవ్, సంగీతం : రఘు దీక్షిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సుహాసిన రాహుల్, మాటలు : సందీప్ గుంటా, ప్రొడక్షన్ డిజైనర్ : దీప్, పి.ఆర్.వో.: జి.ఎస్.కే మీడియా గ్రూప్, నిర్మాణం : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్, రచన, దర్శకత్వం : విజయ్ యెలకంటి. 

Related Posts