YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఢిల్లీ లో విజవంతమైన లాక్‌డౌన్‌: సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

ఢిల్లీ లో విజవంతమైన  లాక్‌డౌన్‌: సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ మే 11
కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో దేశ రాజధానిలో విధించిన లాక్‌డౌన్‌ విజవంతమైందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. గత కొద్ది రోజులుగా ఆక్సిజన్‌ పడకల సంఖ్యను పెంచామని, జీటీబీ హాస్పిటల్‌ సమీపంలో 500 కొత్త ఐసీయూ పడకలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో ఐసీయూ పడకలు, ఐసీయూ కొరత లేదని చెప్పారు. ప్రతి రోజు 1.25లక్షల మోతాదుల టీకా వేస్తున్నామని, త్వరలో మూడు లక్షల టీకాలు వేస్తామని చెప్పారు. వచ్చే మూడు నెలల్లో ఢిల్లీ వాసులందరికీ టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. కానీ టీకాల కొరతను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొద్ది రోజులకే స్టాక్‌ మిగిలి ఉందని చెప్పారు. రెండు కంపెనీలు మాత్రమే వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నాయని, నెలకు 6 నుంచి 7 కోట్ల టీకాలు ఉత్పత్తి చేయగలుగుతాయన్నారు. ఇలా ఐతే ప్రతి ఒక్కరికీ టీకాలు వేయడానికి రెండేళ్లు పడుతుందన్నారు. అప్పటి వరకు మరిన్ని కరోనా వేవ్‌లు వస్తాయని, యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచడం ముఖ్యమని, టీకాలు వేసేందుకు జాతీయ ప్రణాళిక రూపొందించాలని కేంద్రాన్ని కోరారు.

Related Posts