YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

*ఏపీ Covid కమాండ్ కంట్రోల్*

*ఏపీ Covid కమాండ్ కంట్రోల్*

కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ వలన రాను రాను దేశం లో  ఏర్పడిన ప్రమాదకర పరిస్థితిని యుద్ద ప్రాధిపకతన పరిష్కరించడానికి గాను వైద్య సేవలు పెంచాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని, వైద్య రంగం లో శిక్షణ పొందుతున్న వారిని  తక్షణమే రంగం లో దింపి తగు విధంగా ఎదుర్కొనుటకు గాను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నేషనల్ మెడికల్ కమిషన్ మరియు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌తో సంప్రదించి ఈ క్రింది మార్గదర్శకాలను జారీ చేసి వాటిని తక్షణమే అమలు చేసి నిర్వహించుటకు గాను తగు చర్యలు చేపట్టాలని   రాష్ట్రాలను కోరడం జరిగింది.
*ఎవరిని తీసుకోవాలి? మరియు వారికి నిర్దేశించే విధులు?*
కోవిడ్ సెకండ్ వేవ్ వలన ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల  నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను అనుసరించి MBBS పూర్తిచేసిన విద్యార్థులు పీజీ ప్రవేశాల నిమిత్తము హాజరు కాబోయే పరీక్ష అయిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-నీట్ (పిజి) - 2021 వాయిదా పడుతోంది.
ఈ పరీక్ష 2021 ఆగస్టు 31 లోపు జరగదు. పరీక్ష నిర్వహించే తదుపరి తేదీ అనేది  పరీక్ష రాయ బోయే అభ్యర్థులకు కనీసం ఒక నెల ముందు తెలుపబడుతుంది, మరియు సమయం ఇవ్వబడుతుంది.
రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంత  ప్రభుత్వాలు దీనిని పరిగణలోకి తీసుకుని  పీజీ పరీక్షకు హాజరు కాబోయే ప్రతి MBBS అభ్యర్థిని గుర్తించడానికి  అన్ని ప్రయత్నాలు చేసి, వైద్య సేవల పరంగా అత్యంత అవసరమైన  ఈ సమయం లో  కోవిడ్ -19 నిర్వహణల వర్క్‌ ఫోర్స్‌లో వారిని  చేరమని ఒప్పించాలి.
రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంత  ప్రభుత్వాలు మెడికల్ విద్యార్థుల యొక్క ఇంటర్న్‌షిప్ రొటేషన్‌లో భాగంగా వారిని వారి  అధ్యాపకుల పర్యవేక్షణలో కోవిడ్ మేనేజ్‌మెంట్ విధుల్లో నియమించవచ్చు.
*ఫైనల్ ఇయర్ MBBS* విద్యార్థులను, టెలి-కన్సల్టేషన్ మరియు తేలికపాటి లక్షణాలు గల కోవిడ్ కేసుల పర్యవేక్షణ వంటి సేవలను అందించడానికి వారిని ఉపయోగించుకోవచ్చు.
*పిజి  సూపర్ స్పెషాలిటీలు  కోర్స్* లకు సంబందించి మొదటి సంవత్సరం  విద్యార్థుల బ్యాచ్‌లు చేరే వరకు ఫైనల్ ఇయర్ పిజి విద్యార్థుల యొక్క సేవలు ఉపయోగించుకోవచ్చు మరియు  వారిని కొనసాగించవచ్చు.
అదేవిధంగా, కొత్త నియామకాలు జరిగే వరకు సీనియర్ రెసిడెంట్ మరియు   రిజిస్ట్రార్ల సేవలను ఉపయోగించుకోవచ్చు మరియు వారిని  కొనసాగించవచ్చు.
*B.Sc. మరియు GNM* పూర్తిచేసిన అర్హత గల నర్సులను ఐసియు, మొదలైన వాటిలో సీనియర్ వైద్యులు మరియు సీనియర్ నర్సుల పర్యవేక్షణలో పూర్తి సమయం కోవిడ్ విధుల్లో ఉపయోగించుకోవచ్చు.
చివరి సంవత్సరం GNM లేదా B.Sc. (నర్సింగ్) పూర్తిచేసి, ఫైనల్ పరీక్షలు రాసి, ఫలితాలకోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను సీనియర్ ఫ్యాకల్టీ పర్యవేక్షణలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద ఫుల్ టైమ్ కోవిడ్ నర్సింగ్ విధులను కేటాయించవచ్చు.
ఇతర ఆరోగ్య అనుబంధ సంరక్షణ నిపుణులు  వారు పొందిన  శిక్షణ మరియు సంబంధిత ధృవీకరణ ఆధారంగా వారి యొక్క సేవలను కోవిడ్ మేనేజ్‌మెంట్‌లో సహాయం కొరకు  ఉపయోగించుకోవచ్చు.
పైన సూచించిన  విధంగా సమీకరించబడిన అదనపు మానవ వనరులను కోవిడ్ ఆసుపత్రి సౌకర్యాలలో నిర్వహణ కొరకు మాత్రమే ఉపయోగించాలి.
*చేసే వైద్య సేవలకు  ప్రభుత్వం తరపున లభించే  గుర్తింపు మరియు అందించే ప్రోత్సాహకాలు*
ఆరోగ్య నిర్వహణ  అనేది రాష్ట్రానికి చెందిన  విషయం. మరియు ఈ ఆరోగ్య సంరక్షణ నిర్వహణ   కోసం తగిన మానవ వనరులను  నియమించే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ గా నిమగ్నమై ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తమ సొంత సంస్థల నిర్వహణ కోసం నిమగ్నమై ఉంది. ప్రైవేటు రంగం లో కూడా పెద్ద సంఖ్యలో ఆరోగ్య నిపుణులను నియమించుకోవడానికి వారు నిమగ్నం అయినట్లు మనం గమనించవచ్చు.
పైన పేర్కొన్న సడలింపులన్నీ  నేషనల్ మెడికల్ కమిషన్ మరియు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌తో సంప్రదించి ఖరారు చేయబడింది. కోవిడ్ -19  కి ప్రతిస్పందించడానికి మానవ వనరులను మరింత పెంచే  ప్రయత్నంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు పూర్తిగా నిమగ్నమవ్వాలి.
పైన పేర్కొన్న ప్రతిపాదనలు  అమలు చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంత  ప్రభుత్వాలు అదనపు సిబ్బంది ని ఒప్పంద నియామకం ద్వారా నియమించుకొనుటకు   జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ద్వారా  సూచించబడిన ప్రమాణం అనేది పరిగణించబడుతుంది.కోవిడ్ విశిష్ట సేవలకు తగిన గౌరవం గా  చెల్లించే వేతనములకు   సంబందించి సూచించిన నిబంధనలు అమలుపరచడములో రాష్ట్రాలకు వెలుసుబాటు  ఉంటుంది.
కోవిడ్ వైద్య సేవలకు  సంబందించి కనీసం 100 రోజులు పనిచేసే వారికి మాత్రమే ఈ యొక్క ఆర్థిక ప్రోత్సాహక వేతనం అనేది లభిస్తుంది.
ఈ విధంగా కోవిడ్ 19 తో పోరాటం లో  నిమగ్నమైన  ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య నిపుణులందరూ  ప్రభుత్వ బీమా పథకాల పరిధిలోకి వస్తారు.
కనీసం 100 రోజుల పాటు  కోవిడ్ వైద్య సేవలు అందించడానికి అంగీకారం తెలిపి ఉద్యోగ విధులను విజయవంతంగా పూర్తిచేసే అటువంటి ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య నిపుణులు అందరికీ భారత ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి విశిష్ట కోవిడ్ నేషనల్ సర్వీస్ సమ్మాన్ ఇవ్వబడుతుంది.
ఈ ప్రక్రియ ద్వారా అదనపు ఆరోగ్య నిపుణులను రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాల  ప్రభుత్వాలు ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులకు మరియు అవసరమైన చోట అందించడానికి  నిమగ్నమవ్వాలి.
కోవిడ్ సంబంధిత   కార్యక్రమాలలో నిమగ్నమైన వైద్య నిపుణులకు  తగిన విధంగా టీకాలు వేసేలా రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాల  ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
ఈ ప్రత్యేక పథకం కింద కనీసం 100 రోజుల కోవిడ్ సంబంధిత విధులను  పూర్తిచేసే ఆరోగ్య నిపుణులను  ముందు ముందు రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాల  ప్రభుత్వాలు వాటి యొక్క  సంబంధిత పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు  ఇతర నియామక సంస్థల ద్వారా చేబట్టబోయే అన్ని రెగ్యులర్ నియామకాలలో వీరికి  ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది.
ఆరోగ్య మరియు వైద్య విభాగాలలో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సుల అనుబంధ ఆరోగ్య నిపుణులు మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ సిబ్బంది పదవులను త్వరితగతిన వేగవంతమైన ప్రక్రియల ద్వారా మరియు కాంట్రాక్టు నియామకాల ద్వారా 45 రోజుల లోపు  నింపాలని రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాల  ప్రభుత్వాలను కోరడం జరిగినది.
రాష్ట్ర ప్రభుత్వము వైద్యరంగంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు యొక్క సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ఉంది ముఖ్యంగా కోవిడ్ హాస్పిటల్స్ లో కోవిడ్ కేర్ సెంటర్లలో వీరు అంకితభావంతో సేవలందిస్తూ ఉన్నారు.
************************
 డాక్టర్ అర్జా శ్రీకాంత్
AP స్టేట్ కోవిడ్  నోడల్ ఆఫీసర్

Related Posts