YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

క‌రోనాతో పెరిగిపోయిన ఆస్తిప‌న్నుల బాకీ

క‌రోనాతో పెరిగిపోయిన ఆస్తిప‌న్నుల బాకీ

హైద్రాబాద్, మే 12, 
గ్రేటర్‌లో చాలాకాలంగా పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయి లను వసూలు చేయడానికి సర్కార్‌ ప్రకటించిన వన్‌టైం స్కీం (ఓటీఎస్‌)కు కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ప్రకటించిన 45రోజుల గడువులో స్పందన నామమాత్రంగానే ఉంది. పాతబకాయిలను చెల్లించడానికి బకాయిదారులు ముందుకురావడంలేదు. అయితే కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధిలేకపోవడం, వ్యాపారాలు దెబ్బతినడం, వాణిజ్యరంగాలపై తీవ్ర ప్రభావంతోనే బకాయిలు పెద్దగా వసూలు కావడంలేదని బల్ది యా అధికారులు చెబుతున్నారు.గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) దృష్టిసారించింది. ఇప్పటికే అప్పులపాలైన బల్దియా ఆదాయం కోసం వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. సర్కార్‌ ప్రకటించిన ఓటీఎస్‌లో భాగంగానే 15-20ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను బకాయిలను వసూలు చేయడానికి కసరత్తు చేస్తోంది. ఆస్తిపన్ను బకాయిలు చెల్లిస్తే 90శాతం వడ్డీ మాఫీ చేయనున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్న విషయం విదితమే. బకాయిలతోపాటు 10శాతం వడ్డీని ఈనెల 1వ తేది నుంచి 15వ తేదిలోగా 45 రోజుల్లో చెల్లించాలని బల్దియా ప్రకటించింది. ఈ స్కీమ్‌ను విని యోగించుకునేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు విసృ ్తతంగా ప్రచారం చేసింది. అయినా ఆశించిన స్థాయిలో ఫలి తాలురావడంలేదు.జీహెచ్‌ఎంసీ పరిధిలో 5.41లక్షల మంది ఆస్తిపన్ను బకాయిలుదారులు ఉన్నారు. బకాయిలతోపాటు 10శాతం వడ్డీని ఆగష్టు 1వ తేది నుంచి సెప్టెంబర్‌ 15వ తేదివరకు(45రోజుల్లో) చెల్లించాల్సి ఉన్నది. గ్రేటర్‌లో 16లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపు దారులు ఉన్నారు. 2019-20 ఆర్థిక సంవ త్సరంలో 9.89లక్షల మంది రూ.1,394.72కోట్లు చెల్లిం చారు. మరో 5.41లక్షల మంది నుంచి రూ.1,477.86కోట్ల ఆస్తిపన్ను బకాయిలతోపాటు వీటిపై వడ్డీ రూ.1,017.76కోట్లు రావాల్సి ఉంది. ఈ స్కీంతో జీహెచ్‌ఎంసీ ఖజానాకు పాత బకాయిలు రూ.1,477.86కోట్లతో వడ్డీ రూ.10కోట్లు రావాల్సి ఉంది.రూ.1,545.75కోట్లకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 5.41లక్షల బకాయిదారుల నుంచి పాతబకాఇయలు, వడ్డీ కలిపి రూ.1,545.75కోట్లు రావాల్సి ఉంది. ఈ బకాయిలను చెల్లించడానికి సర్కార్‌ ప్రకటించిన ఓటీఎస్‌లో భాగంగా 45రోజులు గడువు ఇచ్చింది. ఇప్పటికే 40రోజులు గడిచాయి. అయితే ఈనెల 8వ తేది వరకు 45,985మంది బకా యిల ద్వారా రూ.93.18కోట్లు వసూలైంది. ఇంకా 4,95,025 బకాయిదారుల నుంచి రూ.1,452.57కోట్లు వసూలుకావాల్సి ఉంది.ఓటీఎస్‌పై బకాయిదారులు, ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు జీహెచ్‌ఎంసీ భారీస్థాయిలో ప్రచారం చేసింది. అందు బాటులో ఉన్న ఆసిపన్ను బకాయిదారుల మొబైల్‌ నెంబర్లకు 90శాతం వడ్డీ రాయితీ వెసులుబాటు గురించి సంక్షిప్త సందేశాలు పంపించింది. ఎఫ్‌ఎం రేడియో జింగిల్స్‌, టెలివిజన్‌ ఛానల్స్‌లో స్క్రోలింగ్స్‌తో పాటు అన్ని సర్కిళ్లలోని 150 బస్‌ షెల్టర్లుపై తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషల్లో ప్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయినా ఫలితం నామమాత్రంగానే ఉంది. మొత్తం బకాయిల్లో కనీసం 10శాతం కూడ వసూలు కాలేదు. మిగిలిన 5రోజుల్లో బకాయిలు వసూలయ్యే అవకాశంలేదు. దీంతో బకాయిలు చెల్లించేందుకు మరోసారి గడువు పెంచేందుకు సర్కార్‌ కసరత్తు చేస్తోంది.

Related Posts