YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రెవెన్యూలో సంస్కరణలు : కేఈ కృష్ణమూర్తి

రెవెన్యూలో సంస్కరణలు : కేఈ కృష్ణమూర్తి

గత  నాలుగు సంవత్సరాల్లో రివెన్యూశాఖలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం.   2018లో ఇ గవర్నెన్స్ కింద కేంద్రం నుండి ఏపి రివెన్యూ శాఖకు ప్రసంసా పత్రం లభించిందని రెవెన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కే ఈ కృష్ణ మూర్తి అన్నారు. శనివారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా అయన  నాలుగు సంవత్సరాల రివెన్యూ శాఖ ప్రగతిని వివరించారు.  చుక్కల భూమిని క్రమబద్దీకరణ చేయడం వల్ల ఎంతో మంది గ్రామీణ ప్రజలు లబ్దిపోందారు.  స్వాతంత్ర సమరయోధులు భూమలు బదిలీకి అనుమతులు మా ప్రభుత్వం ఇచ్చింది.  గ్రామకంఠాలు సమస్యను 22ఏ నిషేదిత జాబితానుండి తోలగించాం. దీంతో మధ్యతరగతి వర్గానికి మేలు జరిగింది.  నాల చట్ట సవరణ చేయడం వల్ల పారిశ్రామిక ప్రగతికి ప్రయోజనం చేకూరిందని అన్నారు.  భూసేవ ద్వారా ప్రతి ల్యాండ్ కు 11 సంఖ్యల భూసేవ సంఖ్యను కేటాయిస్తున్నాం.  అక్టోబర్ నాటికి రాష్ట్ర మంతటా ఈ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించాం. ఈ భూమి వెబ్ సైట్ అందుబాటులో ఉంచడం వల్ల రికార్డులను ఎవ్వరయినా చూసుకునే అవకాశం కల్సిస్తున్నామని అన్నారు. ఈ పంట ద్వారా రైతు ఉత్పత్తి  ఏంచేస్తున్నాడో ట్యాబ్ లో నమేదు చేసుకున్నాం.  లోన్ చార్జి క్రియోషన్ మాడ్యూల్ ద్వారా బ్యంకు బుణం పోందే వ్యక్తి నిజమయిన రైతో కాదో తెలుసుకోవచ్చు.  ఈ పట్టాదారు పాస్ బుక్ ను 15 నిముషాల్లో అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు.  పాస్ బుక్ తప్పని సరి కాదు అది కూడా ఒక అధనపు ఆధారం మాత్రమే.  రిజిష్ట్రేషన్లు లో సరాసరి నాలుగు సంవత్సరాల్లో 16.53శాతం వృద్ది సాధించామని వెల్లడించారు.  2017-18 సంవత్సరాల్లో  నాలుగు వేల కోట్లు లక్ష్యానికి గానే నాలుగు వేల 242 కోట్లు వృద్ది సాధించాం.  తప్పుడు రిజిష్ట్రేషన్లు కు అడ్డుకట్ట వేయడానికి ఆధార్ ద్వారా అనుసంధానం చేశామని అయన వివరించారు. 

Related Posts