YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మీకు మీరే ప్రశ్నించుకోవాలి

మీకు మీరే ప్రశ్నించుకోవాలి

న్యూ ఢిల్లీ మే 12,  ఇలాంటి సమయాల్లో కరోనా యోధుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయదా?  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి బిజేపి అద్యక్షుడు నడ్డా లేఖ.
భారతదేశం ప్రస్తుతం కోవిడ్-19మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది.మన కరోనా యోధులు ఈ పోరాటంలో ఉత్సాహంతో నిమగ్నమయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ మన దేశం నిర్వహిస్తోంది. భారతదేశం ప్రపంచ ఉత్తమ పద్ధతుల అనుసరిస్తూ టీకా వ్యూహాన్నికొనసాగిస్తోంది. జనవరి ప్రారంభంలో ఈ వ్యాక్సినేషన్ మొదలుపెట్టాం. కరోనా యోధులు తొలి డోసులు పొందేలా చూశాం. రెండవ తరంగంతో పోరాడేందుకు ఇది మనకు ఎంతో సహాయపడింది. భారతదేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతున్న సమయంలో అనేక పాశ్చాత్య దేశాలు సైతం తమ యువతకు టీకాలు వేయడం ప్రారంభించలేదన్న విషయం మీకుఖచ్చితంగా తెలిసి ఉంటుందని నేను భావిస్తున్నాను.
2020లో కరోనా వెలుగు చూసినప్పటి నుండి ఈమహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని అస్త్రశస్త్రాలను సంధిస్తూ పని చేసుకుపోతుంది. ప్రాధాన్య క్రమంలో వైద్య వసతులు, సామర్థ్యాలను పెంచుతున్నారు.కరోనాతో బాధపడేవారికి తగిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు కావాల్సిన మందులు, పరికరాలు దేశ నలుమూలలకు సమకూర్చేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. 2020లోభారత ప్రభుత్వం 80 కోట్ల మంది భారతీయులకు 8 నెలల పాటుఉచితంగా రేషన్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఇస్తోంది. కరోనావైరస్ నుజయించే ప్రయత్నంలో ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రులతో నిర్వహించిన పలు సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశాలుస్నేహపూర్వక, సానుకూల వాతావరణంలో జరిగాయి. ప్రధానమంత్రి విస్తృత శ్రేణి భాగస్వామ్యులతో సంప్రదింపులు జరపడాన్నిమాజీ ప్రధాని హెచ్‌.డి. దేవేగౌడ స్వయంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో, ఇలాంటి క్లిష్ట సమయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన బాధ కలిగించింది, కానీ ఆశ్చర్యంగా లేదు. మీ పార్టీలోని చాలామంది సీనియర్ నాయకులు నిరంతరం వ్యాప్తి చేస్తున్న ప్రతికూలతల వల్ల మీ పార్టీలో కొంతమంది సభ్యులు (అనేక మంది నిస్వార్థపరుల మాదిరిగా) ప్రజలకు సహాయం చేయడంలో చేస్తున్న ప్రశంసనీయమైన కృషి మరుగున పడుతుంది.
ఈ లేఖను బాధతోరాస్తున్నాను. ఇలా రాయాల్సింది కాదు. కానీ, మీపార్టీకి చెందిన ముఖ్యమంత్రులతో సహా కాంగ్రెస్ నాయకులు సృష్టిస్తున్న గందరగోళాన్ని చూస్తే తప్పనిసరి పరిస్థితుల్లో నా ఆలోచనలను మీ ముందుంచేందుకు రాయాల్సి వచ్చింది. భారతదేశం కోవిడ్-19తో పోరాడుతున్నప్పుడు సైతం కాంగ్రెస్ ఉన్నత శ్రేణి నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు, రాజకీయ ప్రయోజనాల కోసం విరుద్ధ వైఖరులు ప్రదర్శిస్తున్నారు. టీకాతో ప్రారంభిస్తాను. గత సంవత్సరం మనశాస్త్రవేత్తలు, వైద్యులు, ఆవిష్కర్తలు వ్యాక్సిన్‌ను కనుగొనడంలో నిమగ్నమై ఉంటే, మీ పార్టీ నాయకులు ఈ ప్రయత్నాలను ఎగతాళి చేయడానికి వచ్చిన ఎలాంటి అవకాశం వదిలి పెట్టలేదు. భారత తయారీ వ్యాక్సిన్ దేశానికి గర్వకారణం. కానీ, కాంగ్రెస్ నాయకులు దీనిని ఎగతాళి చేశారు, ప్రజల మనస్సులలో సందేహాలను లేవనెత్తేందుకు ప్రయత్నించారు. మీ పార్టీకి చెందిన ఒక ముఖ్యమంత్రి కూడా ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఇటీవలి కాలంలో వ్యాక్సిన్ లపై ప్రజల్లో ఎలాంటి సందేహాలు లేని సమయంలో, ఈ వ్యాక్సిన్ పై సందేహాలు సృష్టించేందుకు ప్రయత్నించిన నీచమైన రికార్డు మీ పార్టీకి ఉంది, అదీ శతాబ్దానికి ఒక్కసారి వెలుగు చూసే ఇలాంటి భయంకరమైన మహమ్మారి కాలంలో. టీకాపై మోదీ ప్రభుత్వం తన బాధ్యతను‘‘తప్పించుకుంది’’ అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీకి,ఆ పార్టీ అధికారాన్ని పంచుకునే రాష్ట్రాలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా? చాలా మంది కాంగ్రెస్ నాయకులు గత ఏప్రిల్‌లోనే‘‘టీకా వికేంద్రీకరణ’’కోసం పిలుపునిచ్చారు. తొలిదశల్లో రాష్ట్రాలకు 16 కోట్లకు పైగా వ్యాక్సిన్లను అందించి ప్రాధాన్యత సమూహాలలో గణనీయంగా వ్యాక్సినేషన్ కవరేజ్ సాధించినట్లు భారత ప్రభుత్వం ఇప్పటికే నిర్ధారించింది. ఇప్పుడు కూడాసేకరిస్తోన్న50% వ్యాక్సిన్ లను ఉచితంగానే ఇస్తోంది. వ్యాక్సిన్ల లభ్యతపై సాగుతున్న చర్చను కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. బిజెపి లేదా ఎన్‌డిఎ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తామని ప్రకటించి పేదలను ఆదుకోవాలనే సంకల్పాన్ని ప్రదర్శించాయి. వివిధ రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా పేదల కోసం పరితపిస్తాయని భావిస్తున్నాను. పేదలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలన్న ఇలాంటి నిర్ణయాలను కాదనగలరా? భారతదేశంలో తయారైన కోవిడ్-19వ్యాక్సిన్ ఏ రాజకీయ పార్టీకి లేదా నాయకుడికి చెందినది కాదు, ఇది దేశానికి చెందినది. అయినప్పటికీ, కాంగ్రెస్ రాజకీయాలు తప్పితే ఒక్క మంచి పని చేయలేకపోయింది. కోవిడ్-19తో పోరాడేందుకు కావాల్సిన వైద్య మౌలిక సదుపాయాలఅంశాన్ని కూడా ప్రస్తావిస్తాను. మహమ్మారి వెలుగు చూసినప్పుడు వెంటిలేటర్ల ఆవశ్యకతపైభారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో చర్చించింది. ఇప్పటివరకు సుమారు 45,000 వెంటిలేటర్లను యుద్ధ ప్రాతిపదికన సేకరించి, అన్ని రాష్ట్రాలకు పంపించారు. పీఎం-కేర్స్ ఫండ్ ద్వారా పంపిన వెంటిలేటర్లను కొన్ని రాష్ట్రాల్లో ఉపయోగించకుండా ఉంచిన విజువల్స్ కనిపించడం విచారకరం. ఈ సమస్యలను మీరు ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలోకాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకుల కుత్సితమైన, విరుద్ధమైన వ్యవహారశైలి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీ నాయకత్వంలోని కాంగ్రెస్ లాక్ డౌన్ లను వ్యతిరేకిస్తుంది, మళ్లీ లాక్ డౌన్ పెట్టాలని డిమాండ్ చేస్తుంది.కోవిడ్ రెండవ తరంగంపై కేంద్రం సూచనలను విస్మరిస్తుంది, ఆపై సమాచారం లేదని చెప్తుంది. కేరళలో భారీ ఎన్నికల ర్యాలీలు నిర్వహించి కోవిడ్ కేసులు పెరుగుదలకు కారణమవుతుంది, ఇతర చోట్ల ఎన్నికల ర్యాలీలను తప్పుపడుతుంది. నిరసనలను ప్రోత్సహిస్తుంది, కానీ కరోనా మార్గదర్శకాలను అనుసరించాలన్న విషయాన్ని విస్మరిస్తుంది. రెండవ తరంగం విస్తరిస్తున్నప్పుడూఫేస్ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి వాటిని పట్టించుకోకుండా మీ పార్టీ నాయకులు ఉత్తర భారతదేశంలో సూపర్ స్ప్రెడర్ రాజకీయ కార్యక్రమాలు సంతోషంగా నిర్వహిస్తారు. వీటిని ప్రజల మస్తిష్కాల నుంచి చెరిపేయడం అంత సులువు కాదు. దృష్టి సారించాల్సిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకుఫిబ్రవరి, మార్చి డేటా చూస్తే, పెరుగుతున్న కేసులను గుర్తించడంలో ఏ రాష్ట్రాలు విఫలమయ్యాయో తెలుస్తుంది. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో మరణాల రేటు ఎందుకు ఎక్కువగా ఉంది? మీ ముఖ్యమంత్రులను మీరు తప్పక అడగాలి. ఇప్పుడుకాంగ్రెస్ పార్టీలో కొత్త ధోరణి కనిపిస్తోంది- సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై నిందలు వేయడం. కొత్త పార్లమెంటు అవసరం అన్న వాదన యుపిఎ కాలం నుండే వినిపిస్తుందని మీకు గుర్తు చేయదలచుకున్నాను. గౌరవ మాజీ స్పీకర్ మీరా కుమార్ గారే స్వయంగా కొత్త పార్లమెంట్ భవనం ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తలెత్తిన అనేక సందేహాలను అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నివృత్తి చేశారు. అయినాకాంగ్రెస్ వాస్తవాలను నమ్మదు. సెంట్రల్ విస్టా, చత్తీస్ ఘడ్ ప్రభుత్వం నిర్మిస్తోన్న కొత్త అసెంబ్లీ సముదాయంపై పరస్పరం భిన్న వైఖరులు అనుసరిస్తున్న కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ప్రజలు అర్థం చేసుకుంటారు. గత 70 ఏళ్లుగా వారసత్వంగా పొందిన మన వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాలు ఏమాత్రం సరిపోవని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ఏడు దశాబ్దాల్లో భారతదేశ రాజకీయాల్లో ఏ పార్టీ ఆధిపత్యం చెలాయించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేను అలాంటి వైఫల్యాల గురించి మాట్లాడగలను,కాని ముందే చెప్పినట్లుగా, మా దృష్టి కేవలం మహమ్మారిపైనే ఉంది, రాజకీయాలపై కాదు. మీకు రాసిన ఈ లేఖ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే కాదు, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకు నేతృత్వం వహించిన మంత్రిగానూ. ఇతరులు ఆరోగ్యంగా ఉండటానికి మన వైద్య సిబ్బంది చేసే త్యాగాలను చాలా దగ్గర నుంచి చూశాను. తోటి భారతీయులు తమ కుటుంబాలతో కలిసి ఉండేందుకు వారు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. మీకు మీరే ప్రశ్నించుకోవాలి - ఇలాంటి సమయాల్లో, మీ పార్టీ ప్రవర్తన ఈ కరోనా యోధుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయదా? ఉద్దేశపూర్వకంగా కావచ్చు, లేక మరొకటి కావచ్చు, మీ చర్యలు కరోనాపై పోరును బలహీనపరిచే ప్రయత్నం చేయడం లేదా? సైన్స్ సూత్రాలపై అచంచలమైన నమ్మకం, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం, మన కరోనా యోధులు, సహకార సమాఖ్యవాదంపై పూర్తి నమ్మకంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోకరోనాకు వ్యతిరేకంగా భారతదేశ పోరాటం కొనసాగుతోంది. వైరస్ ను జయించి, ఆర్థిక, సామాజిక సాధికారతతో ముందుకు సాగడానికి భారత ప్రభుత్వం చురుకుగా పని చేస్తుందని నేను మీకు భరోసా ఇవ్వదలిచాను. 

Related Posts