YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

వ్యక్తిగత రుణాలు కోసం నిరతో చేతులు కలిపిన ముతూత్ ఫైనాన్స్

వ్యక్తిగత రుణాలు కోసం నిరతో చేతులు కలిపిన ముతూత్ ఫైనాన్స్

హైదరాబాద్ మే 12
డిజిటల్ రంగంలో తన ఉనికిని బలోపేతం చేసుకోడంలో భాగంగా ఫిన్టెక్ సంస్థ అయిన నిరతో భాగస్వామ్యం కూడుతున్నట్టు ముతూత్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈరోజున ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా, జీతాలతో జీవిస్తున్న ఖాతాదారులు రూ. 1 లక్షదాకా ముతూత్ నుంచి వ్యక్తిగత రుణంగా పొందవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి నిరయాప్ ని డౌన్లోడ్ చేసుకోడం ద్వారా ఇది సాధించవచ్చు.ఈ నిర అనేది, బెంగుళూరు కేంద్రంగా నడుస్తున్న ఫిన్టెక్సంస్థ, భారతీయ మధ్యతరగతి వర్గాల్లో జీతాలు తీసుకునే కార్మికులకి కొద్ది మొత్తాల్లో వ్యక్తిగత రుణాలు ఇస్తుంటుంది. నెలకి 12,000 రూపాయలంత తక్కువ నుంచి నెలజీతం సంపాదించేవారి నుంచి రుణగ్రహీతలకి రుణాలు అందిస్తుంటారు. ఈ భాగస్వామ్యం, ముతూత్ ఫైనాన్స్ వారు తన హామీలేని రుణఖాతాలని పెంచుకోడానికి దోహదపడుతుంది.శ్రీ ప్రదీప్, హెడ్ – పెర్సనల్ లోన్, ముతూత్ ఫైనాన్స్ లిమిటెడ్, ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ, “నాణ్యమైన వ్యక్తిగత రుణాల్లో ప్రగతి సాధించడానికి ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని మేం ఉత్సాహపడుతున్నాం. ముతూత్ ఫైనాన్స్, ఎండ్-ట-ఎండ్ డిజిటల్ ప్రాసెస్ వైపుగా వేగంగా అడుగులేస్తోంది. ఈ చొరవకూడా ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాల్లో ఒక ముందడుగు” అన్నారు. రోహిత్ సేన్, సిఇఒ, ఎన్ఐఆర్ఎ సహవ్యవస్థాపకులు, ఈ సందర్భంగా మాట్లాడుతూ “మా ఫండర్స్ జాబితాలో ముతూత్ పేరు చేరుతున్నందుకు మాకు ఆనందంగా వుంది. ముతూత్ దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని చూరగొన్న బ్రాండ్, ఆర్థిక సేవల్లో విశ్వాసం అన్నది చాలా కీలకమైన అంశం. భారతదేశపు జనబాహుళ్య మార్కెట్లో సరైన సమయానికి, భరించగలిగే వడ్డీకి సాధారణ రుణాలు అందించాలన్న లక్ష్యాన్ని కొసగించగలిగే సామర్థ్యాన్ని మాకు ఈ భాగస్వామ్యం మరింత ఇస్తుంది” అన్నారు.
 

Related Posts