సత్తెనపల్లి నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో పెండింగ్ రోడ్లు, శ్మశానవాటికలు, గ్రామాల లింక్ రోడ్లు, పోలాలకు గ్రావెల్ రోడ్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, నరేగా నిధులతో అభివృద్ధి, ఎండకాలంలో తాగునీటి సరఫరా ఇతర అభివృద్ధిపనులపై స్పీకర్ కోడెల శివప్రసాద రావు శనివారం నాడు సమీక్ష నిర్వహించారు. గుంటూరులోని తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి పారుదల అధికారులు హజరయ్యారు. స్పీకర్ మాట్లాడుతూ శ్మశానవాటికలు చాల ప్రాదాన్యమైన అంశం ఎట్టి పరిస్థితుల్లో జూన్ చివరకల్లా పూర్తి చేయాలి. గ్రామాల్లో ఉన్న పెండింగ్ నిధులతో వెంటనే అభివృద్ధి పనులు పూర్తిచేయాలి. గ్రామాల్లో అభివృద్ధికి అడ్డుపడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాని సూచించారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో కోట్ల నిధులు ఉండి అభివృద్ధి ఎందుకు చేయడం లేదని నాయకులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. మనం చేసిన శ్మశానవాటికలు, మరుగుదొడ్లు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మన దేశంతో పాటు ఇతర దేశాల వాళ్లు వచ్చి మనం నిర్మించిన శ్శశానవాటికలు, మరుగుదొడ్లు చూసి పోతున్నారు.ఎండకాలంలో రెండు నియోజకవర్గాల పరిధిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. సమ్మర్ లో ఒక్క గ్రామం కూడా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడకూడదు. అలాగే గ్రామాల్లోని ఇతర పెండింగ్ సమస్యలు జూన్ నాటికి పూర్తిచేయాలి. సత్తెనపల్లి నియోజకవర్గంలో శ్శశానవాటికల ప్రహరీ నాలువైపులా పూర్తిచేయడానికి అదనంగా కోటిన్నర నిధులు కోడెల ఇచ్చారు.