శ్రీవారి ఆలయంలో చైర్మన్ గా భాద్యతలు చేపట్టిన పుట్టా సుదాకర్ యాదవ్.
బోర్డు సభ్యులుగా భాద్యతలు చేపట్టిన 10 మంది బోర్డు సభ్యులు.
యాంకర్: తిరుమల తిరుపతి దేవస్థానముల పాలకమండలి తిరుమలలో ఎట్టకేలకు కొలువు తీరింది. ఇవాల శ్రీవారి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్న చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పదవీ భాద్యతలు చేపట్టారు. అదే సమయంలో బోర్డు సభ్యులుగా ఉన్న వారు ప్రమాణం చేసి పదవీ భాద్యతుల చేపట్టారు. చైర్మన్ తో పాటు బోర్డు సభ్యులుగా బొండా ఉమామహేశ్వర్ రావు, శివాజీ, పార్థసారది, రాయపాటి సాంభశివరావు, రామచంద్రారెడ్డి, పొట్లూరి రమేష్ బాబు, పెద్దిరెడ్డి, రాయకృష్ణ రెడ్డి, రుద్రరాజు పద్మరాజు, చల్లా బాబు, దొక్కా జగన్నాదంలు ప్రమాణ స్వీకారం చేశారు. వీరి చేత టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారంకు రాష్ట్ర ప్రభుత్వ నుండి మంత్రులు యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆది నారాయన రెడ్డి హాజరైయ్యారు. అయితే ఇంత అట్టహాసంగా జరుగుతున్న పాలకమండలి పదవీ భాద్యతల మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మను ఆహ్వానించక పోవడంపై చర్చనాయంశంగా మారింది.