హైదరాబాద్ మే 12
గత ఏడాది లాక్ డౌన్ సమయంలో మద్యం షాపులు మూసివేయడంతో మందులు బాబులు పడ్డ ఇబ్బంది అంతా ఇంతాకాదు.. దాదాపు 2 నెలలు మద్యం దొరక్క పిచ్చోళ్లు అయిపోయారు. మద్యం దుకాణాలు తెరిచిన రోజు అక్కడ జాతరనే కనిపించింది.తాజాగా నిన్న తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటన వెలువడ్డాక కూడా మద్యం షాపుల ముందు మందుబాబులు పోటెత్తారు. వచ్చే పదిరోజులు ఇక మద్యం దొరకదని భావించి మద్యం షాపులపై ఎగబడ్డారు. భారీ క్యూలైన్లు కనిపించాయి. కొన్ని అయితే కిలోమీటర్ల కొద్దీ ఉన్నాయి.ఒక్కొక్కరు బ్యాగుల్లో పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు పెట్టుకొని పోతున్న దృష్ట్యాలు మీడియాలో కనిపించాయి. కరోనాతో జనాలు చస్తున్నా కూడా మద్యం బాబుల్లో ఈ మద్యం పై ఆశ మాత్రం చావలేదని తేలింది.ఇక తెలంగాణలోని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గల లగ్జరీ బ్రాండ్లకు నెలవైన ‘టానిక్’ అనే బడాబాబుల వైన్స్ వద్ద ఏకంగా నిన్న లాక్ డౌన్ ప్రకటించాక మూడు గంటల్లోనే ఆ షాప్ ఖాళీ అయిపోయిందట.. లాక్ డౌన్ ప్రకటన వెలువడిన వెంటనే ఖరీదైన బ్రాండ్ల లిక్కర్ మొత్తం అమ్ముడు పోయిందట..మూడు గంటల్లో 3.50 కోట్ల మద్య అమ్ముడుపోయిందట..తెలుగు రాష్ట్రాల్లో ఈ జూబ్లీహిల్స్ మద్యం దుకాణాం ఇప్పుడు అత్యధిక కొనుగోళ్లతో రికార్డు సృష్టించింది. ఇక తెలంగాణలోని వైన్ షాపులన్నీ కూడా భారీగా లాభాలు పొందాయట.. ఇలా ఓవైపు కరోనాతో అల్లకల్లోలంగా ఉన్న మద్యం బాబులు మాత్రం లిక్కర్ ను కొనడం ఆపలేదు.