YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

భారత్ కొంపముంచిన తప్పుడు లెక్కలు అమెరికన్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ సంచలన వ్యాఖ్యలు

భారత్  కొంపముంచిన తప్పుడు లెక్కలు అమెరికన్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ సంచలన వ్యాఖ్యలు

న్యూ ఢిల్లీ మే 12
దేశంలో కరోనా మహమ్మారి కేసులు ఊహించని స్థాయిలో భారీగా పెరిగిపోతున్నాయి. గత పది పదిహేను రోజులుగా వరుసగా కరోనా కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి.  ఒక దశలో నాలుగు లక్షల కేసులు కూడా వచ్చాయి. అలాగే వేల కొద్ది మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కనీసం కరోనా తో మరణించిన వారిని కాల్చడానికి కూడా స్థలం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు అంటూ దేశంలో పరిస్థితి ఏవిదంగా అర్థం చేసుకోవచ్చు. భారత్లో కరోనా కేసులు పేరుగుదలపై అమెరికన్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  భారత్ లో కరోనా కేసులు పెరగడానికి తప్పుడు లెక్కలే కారణమని ఆంటోని ఫౌసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.దేశంలో కూరం వైరస్ ను కట్టడి చేశామనే తొందరపాటులో సాధారణ జీవనానికి వెళ్లిపోయారని అవే ఇప్పుడు ఇబ్బందులు తెచ్చిపెట్టాయని డాక్టర్ ఫౌసీ పేర్కోన్నారు. సెకండ్ వేవ్ కి ఇదే ప్రధాన కారణం అన్నారు.  ప్రపంచంలో ఇలాంటి వైరస్లు ఎక్కడ ఉన్నా నిర్ణక్షం చేయకూడదని ఫౌసీ పేర్కొన్నారు.  భారత్ లో పరిస్థితి మరింత చేయిదాటకముందే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దేశంలో వెంటనే మూడ్నాలుగు వారాల పాటు లాక్ డౌన్ విధించాలని అన్నారు. వైరస్ సంక్రమణను విచ్ఛిన్నం చేయాలంటే లాక్ డౌన్ తప్పదని డాక్టర్ ఫౌసీ అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన వద్దని హితవు పలికారు. దేశవ్యాప్తంగా తాత్కాలిక ఆసుపత్రులు కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ ఇవ్వాలని వ్యాక్సిన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని పేర్కొన్నారు. వీలైనన్ని ఎక్కువ కంపెనీలు వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయాలని అన్నారు. కష్టకాలంలో ఇతర దేశాలకు భారత్ అండగా నిలిచిందని ప్రస్తుతం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న భారత్ కు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలవాలని సూచించారు.

Related Posts