YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పారిశుద్ద్యం పై ఉన్నాతాధికారులు సమీక్ష

పారిశుద్ద్యం పై ఉన్నాతాధికారులు సమీక్ష

కాంట్రాక్టు పారిశుధ్ధ్య కార్మికుల సమ్మె వలన పారిశుధ్ద్య సమస్యలు తలెత్తకుండా  చూడాలన్న మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు గారి ఆదేశాలమేరకు తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. శనివారం సచివాలయంలో మున్సిపల్ కమీషనర్లు, జిల్లా పౌర సంబంధాల అధికారులతో  ముఖ్యకార్యదర్శి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. 74 వ రాజ్యాంగ సవరణ ప్రకారం వేతనాల పెంపుకు ఇప్పటికే చర్యలు తీసుకోన్నామని, సమ్మెచేయడంలో తగు సహేతుక కారణాలు లేవని అన్నారు. కాంట్రాక్టు కార్మికుల సమ్మె నేపధ్యంలో క్షేత్ర స్ధాయిలో నెలకొన్న పరిస్ధితులపై సమీక్షించారు. కేవలం 18 మున్సిపాలిటీలలో పాక్షికంగా సమ్మె చేస్తున్నారని, మిగతా మున్సిపాలిటీలలో సిబ్భంది పనిచేస్తున్నారని  తెలిపారు.సమ్మె కొనసాగుతున్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు  చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి ఆదేశించారని ముఖ్యకార్యదర్శి కమీషనర్లకు తెలిపారు.

 కాంట్రాక్టు శానిటేషన్ కార్మికుల వేతనాల పెంపుకు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాలతో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేతనాల పెంపుకు సంబంధించి జివో యంస్.14 ను జారీ చేశామని, దాని ప్రకారం స్ధానిక కౌన్సిల్ అనుమతితో వెంటనే వేతనాల పెంపుకు ఉత్తర్వులు అమలు చేసి సమ్మె విరమింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలలో చెత్త ఎప్పటికప్పుడు తరలించాలని, రోడ్లపై పేరుకు పోకుండా చూడాలని సిబ్భంది అందరు విధులలో పాల్గొనేలా చూడాలని ముఖ్యకార్యదర్శి ఆదేశించారు. శానిటేషన్ సిబ్భంది వేతనాల పెంపుకు ఇప్పటికే అనుమతించామని ఈ విషయమై ఎటువంటి సమస్యలు లేవన్నారు. స్ధానిక సంస్ధలే ఈ నిర్ణయాన్ని అమలు చేయవచ్చాన్నారు. వేతనాల పెంపుకు ఎక్కడన్న మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయకుంటే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాలు తీసుకున్న చోట పరిపాలన పరమైన అనుమతులు జారీ చేయాలన్నారు. మున్సిపల్ కమీషనర్లు, జిల్లా కలెక్టర్లకు అందుబాటులో ఉండి పారిశుధ్ధ సమస్య లేకుండా చూడాలన్నారు.

మున్సిపల్ కమీషనర్లు జిల్లా పౌర సంబంధాల అధికారులు సమన్వయం చేసుకొని పాజిటివ్ వార్తలు వచ్చేలా చూడాలన్నారు. మీడియాతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి చేపడుతున్న పనులపై  వివరించాలన్నారు. మున్సిపల్ కమీషనర్లు క్షేత్ర పర్యటనలు చేయాలని, సిబ్భందిని అందరిని సమన్వయం చేసుకోవాలని ప్రజలపై పారిశుద్ధ్య ప్రభావం పడకుండా చూడాలన్నారు. చెత్త పేరుకు పోకుండా చూడాలని, క్షేత్ర స్ధాయి నుండి కూడా స్పేషల్ ఆఫీసర్లను మున్సిపాలిటీలకు పంపుతున్నామన్నారు.

జూన్ నుండి తాను కూడా క్షేత్ర స్ధాయిలో పర్యటించి సమీక్ష చేయనున్నట్లు వివరించారు. ఆస్తి పన్నులకు సంబంధించి ఖమ్మం కార్పోరేషన్లలో 99 శాతం వసూలు చేసినందుకు ప్రత్యేకంగా అభినందించారు. 15 యూఎల్బీలలో 100 శాతం, 58  యూఎల్బీ లు 90 శాతం పైగా ఆస్తిపన్నును వసూలు చేశారని, ఇదే ఒరవడిని కొనసాగించాలని అన్నారు. మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛంద సంస్ధల భాగస్వామ్యంతో చలివేంద్రాలు,వాటర్ కియోస్క్ లు ఏర్పాటు చేయాలన్నారు.

వర్షాకాల సీజన్ లలో నీళ్లు నిలిచే ప్రాంతాలను గుర్తించి, కంటీజెన్సి ప్రణాళికను రూపొందించుకొని నాలాల క్లీనింగ్, డీసిల్టింగ్ అక్రమణల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని, సేకరించిన చెత్తను  సైంటిఫిక్ గా డిస్పోస్ చేయాలని, క్యాపింగ్ చేయాలని అన్నారు. మె నెలలో మున్సిపల్ కమీషనర్లతో హైదరాబాద్ లో ఒక రోజు వర్క్ షాపు నిర్వహిస్తామని, తమ, తమ మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా చేపట్టిన మంచి పనుల వివరాలను పంపాలని, దీనిని ఇతర మున్సిపాలిటీలలో చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ శాఖ కమీషనర్ టి.కె.శ్రీదేవి మున్సిపాలిటీలలో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై సమీక్షించడంపై ఎక్కడా ప్రజలకు ఇబ్భందులు రాకుండా చూడటంతో పాటు అందరూ విధులలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సమాచార శాఖ జె.డి.  నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts