YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

చెత్తబుట్టలో కోవిడ్ వయల్స్

చెత్తబుట్టలో కోవిడ్ వయల్స్

భీమవరం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వ్యాక్సినేషన్ కేంద్రాల నుండి వయల్స్ పక్కదారి పట్టాయి.  ఒకటిన్నర వయల్ ను అక్కడి వైద్య సిబ్బంది చెత్తబుట్టలో దాచి ఉంచిన సంగతి బయటపడింది. స్థానిక ఎఎంసి ప్రాంగణంలో వ్యాక్సిన్ కేంద్రంలో వెలుగుచూసిన వ్యాక్సిన్ లో అక్రమాల గుట్టు రట్టయింది.  వందమందికి గాను 85 వ్యాక్సిన్ వయల్స్ మాత్రమే  సిబ్బందివేసారు.  మిగతా వాటిని చెత్తబుట్టలో దాచారు. ఈ  వ్యాక్సిన్ వయల్స్ ను గుర్తించిన తహసీల్దార్ రమణారావు,   సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు. దాంతో ప్రత్యేక అధికారులతో విచారణకు సబ్ కలెక్టర్ ఆదేశించారు, ఒక్కో వయల్ కు రూ.20 వేల వరకూ మార్కెట్ లో ధర పలుకుతుండడంతో సిబ్బందిపై అనుమానాలు వ్యక్తిమవుతున్నాయి.

Related Posts