నల్లగొండ
నల్లగొండ జిల్లా కేంద్రంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను ఫుడ్ ఇన్స్పెక్టర్ పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రెండు లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రోజు ఉదయం 6 గంటలకు పట్టణంలోని ప్రకాశం బజార్ లో ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న ట్రేడర్స్ పై దాడి చేసిన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారుల బృందానికి తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లు లభించాయి. శ్రీ లక్ష్మీ ప్రసన్న ట్రేడర్స్ లో నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేశారు. వీరిపైన ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అనుమతి తీసుకొని పి.డి యాక్ట్ నమోదు చేయనున్నట్లు ఇన్స్పెక్టర్ జ్యోతిర్మయి స్పష్టం చేశారు. లాక్ డౌన్ ను ఆసరాగా చేసుకుని లాక్ డౌన్ సమయంలో నిషేధిత గుట్కా ను పది రెట్లు అధిక రేటు లాభానికి అమ్ముతూ ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగిస్తున్నట్టు ఇన్స్పెక్టర్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.