విశాఖపట్నం
ఐదేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తో న్న నర్సులనందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ కెజిహెచ్ సూపరింటెండెంట్ కార్యాల యం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా అసోసియే షన్ అధ్యక్షులు ఎస్కె మదీనా మాట్లాడుతూ ఐదేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో నర్సులుగా విధులు నిర్వహిస్తోన్న వారికి నెలకు రూ.22,500 జీతం ఇస్తున్నారని తెలిపారు. 2020 సెప్టెంబర్లో కొత్తగా తీసుకున్న కాంట్రాక్టు నర్సులకు నెలకు రూ.34 వేలు వేతనం ఇస్తున్నారన్నారు. పాత వారికి కూడా కొత్త వారికి ఇస్తున్నంత వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో జిల్లాలో 160 మంది, రాష్ట్రంలో వెయ్యి మంది నర్సులు పనిచేస్తున్నారని తెలిపారు.