YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఏటీఎం దోపిడీ దొంగలు ఇద్దరు అరెస్టు

ఏటీఎం  దోపిడీ దొంగలు ఇద్దరు అరెస్టు

హైదరాబాద్
పక్కా ప్లాన్తోనే హైద్రాబాద్ కూకట్పల్లి ఏటీఎం సెంటర్లో  దోపిడీకి పక్కా ప్లాన్ చేశారని  సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు.ఈ కేసులో ఇద్దరు బీహార్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశామన్నా రు.కూకట్పల్లి ఏటీఎం లో సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపి దోపీడకి పాల్పడ్డారు.ఈ ఇద్దరికి మరో నాలుగు కేసులతో కూడ సంబంధం ఉందని ఆయన తెలిపారు.తొలుత తుపాకీతో బెదిరించి దోపీడీకి పాల్పడ్డాలని భావించారు. కానీ సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో అతనిపై కాల్పులు జరిపినట్టుగా సీపీ చెప్పారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
బీహార్   చెందిన  అబిజిత్ కుమార్,  ముఖేష్ లు  ఏటీఎంలో డబ్బులు నింపే వాహనాలను లక్ష్యంగా చేసుకొని దోపీడీ చేయాలని ప్లాన్ చేశారన్నా రు.ఇందుకోసం బీహార్ నుండితుపాకీని సమకూర్చుకొన్నారన్నారు. అయితే ఈ తుపాకీ పనిచేస్తోందో లేదో తెలుసుకొనేందుకు గాను మైసిగండి వద్ద పరీక్షించినట్టుగా చెప్పారు.   ఆ తర్వాత  ఏప్రిల్ 29వ తేదీన  కూకట్పల్లి ఏటీఎంలో డబ్బులు పెట్టే క్యాష్ వెహికిల్ ఫాలో అయ్యారని ఆయన చెప్పారు.  ఈ విషయాన్ని డబ్బులు  ఏటీఎంలో జమ చేసే సిబ్బంది గుర్తించలేదన్నారు. కూకట్ పల్లి ఏటీఎం సెంటర్ లో డబ్బులు నింపే సమయంలో  సెక్యూరిటీ నింది తుడి నుండి తుపాకీని లాక్కొనే సమ యంలో అబిజిత్ కాల్పులు జరిపిన ట్టుగా ఎస్పీ చెప్పారు. సెక్యూరిటీ గార్డుతో పాటు  ఏటీఎంలో డబ్బులు నింపే ఆపరేటర్లు శ్రీనివాస్, నవీన్ లు నిందితులను పట్టుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారని  సీపీ వివరించారు.నవీన్, శ్రీనివాస్ లకు మరికొందరు సహాయంగా వస్తే  నిందితులు అక్కడే  పట్టుబడిపోయేవాళ్లని ఆయన చెప్పారు.నిందితుల నుండి రూ. 6.31 లక్షల నగదు, తుపాకీ, బైక్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొన్నామని సీపీ తెలిపారు.  50 ఏళ్లు దాటిన వారిని సెక్యూరిటీ గార్డుగా నియమించు కోవద్దని  సీపీ బ్యాంకు మేనేజర్లకు సూచిస్తున్నారు. ఈ విషయమై తాము త్వరలోనే బ్యాంకర్లతో సమావేశంకానున్నట్టుగా చెప్పారు

Related Posts