YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

భార్యపై గృహహింస చట్టం కింద కేసు!

భార్యపై గృహహింస చట్టం కింద కేసు!

 భర్త చిత్రహింసలు పెడుతున్నాడని, మానసికంగా, శారీరకంగా హింస్తున్నాడంటూ మహిళలు గృహ హింస చట్టం కింద కేసులు పెట్టడమే ఇప్పటివరకూ చూశాం. కానీ, అందుకు భిన్నంగా భర్తే తన భార్యపై గృహ హింస చట్టం కింద కోర్టును ఆశ్రయించాడు. ఏపీ రాష్ట్రంలో ఓ భర్త గృహ హింస చట్టం కింద కోర్టును ఆశ్రయించడం ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. తన భార్య తనను చిత్ర హింసలు పెడుతుందంటూ రామ్‌కుమార్‌ అనే వ్యక్తి విజయవాడ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు.

ఇదివరకే పెళ్లైన విషయం తన వద్ద దాచిన సదరు మహిళ తనను మరో వివాహం చేసుకుందని వాపోయాడు. పెళ్లైన రెండు నెలల నుంచే తన భార్య తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలంటూ రామ్‌కుమార్ పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించాడు.

Related Posts