న్యూఢిల్లీ, మే 13,
చైనా వక్ర బుద్ది మరోసారి బహిర్గతమైంది. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్‌కు డ్రాగన్ దేశం ఝలక్ ఇచ్చింది. చైనా కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇండియాపై నేరుగానే ప్రతికూల ప్రభావం పడనుంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. చైనా కావాలనే భారత్‌కు సమస్యలు సృష్టిస్తోందని అనిపిస్తోంది. దేశంలో కోవిడ్ 19 సెకండ్ వేవ్ చాలా ఎక్కువగా ఉంది. కోవిడ్ 19 కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చైనా సప్లయర్లు కోవిడ్ 19 సంబంధిత గూడ్స్ ధరలను భారీగా పెంచేశాయి. 5 రెట్లు వరకు ధరలు పెంచాయి. అంతేకాకుండా చైనా డ్రగ్ సప్లయర్లు పలు ఔషధ కాంట్రాక్టులను కూడా రద్దు చేసింది. చైనా సప్లయర్లు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ల ధరలను కూడా 5 రెట్లు వరకు పెంచేశాయి. గత ఏడాది కూడా చైనా వెంటిలేటర్లను ధరలను పెంచింది. ఈసారి చైనా ధరలను పెంచడం మాత్రమే కాకుండా ఔషధాల సరఫరాకు సంబంధించిన చాలా వరకు డ్రగ్ కాంట్రాక్టులను దర్దు చేసింది.
చైనా తీసుకున్న నిర్ణయాల కారణంగా కోవిడ్ 19 చికిత్సలో ఉపయోగించే ఉపకరణాలు, ఔషధాల ధరలు పెరుగుతున్నాయి. 10 లీటర్ల ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ల సగటు ధర 200 డాలర్ల నుంచి 1000 డాలర్లకు పెరిగింది. కరోనా కష్టకాలంలో చైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం శోఛనీయమని చెప్పాలి. కరోనాని అన్ని దేశాలకు అంటించి.. ఇప్పుడు చైనా చోద్యం చూస్తున్నట్లు ఉంది.