YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

వరాహస్వామి

వరాహస్వామి

లోక క్షేమం కోసం, మానవులు సన్మార్గంలో సుఖంగా జీవించడానికి మహావిష్ణువు వేద శాస్త్రాలను యిచ్చాడు. ఆ శాస్త్రాలు ఉపయోగపడని రోజున తానే స్వయంగా అవతరించాడు.  అలా అవతరించిన పది  అవతారాలలో వరాహావతారం మిక్కిలి ప్రసిద్ది  చెందినది.
ఒకసారి నలుగురు మహర్షులు శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వైకుంఠానికి వచ్చారు. ద్వారపాలకులైన జయ ,విజయులు వారిని అడ్డగించారు. అందుకు ఆ ఋషులు ఆగ్రహంచెంది "మీరు భూలోకంలో పుట్టెదరు గాక అని శపించారు. " జయ , విజయులు మహర్షులను వేడుకున్నారు. మీ శాపం ప్రకారం మేము భూలోకంలో ఎలా జన్మించినా మహావిష్ణువు పేరు మరువకుండా వుండేట్టు చేయమని "  శరణుకోరుకున్నారు. అప్పుడు మహావిష్ణువు అక్కడ  దర్శనమిచ్చి, మహర్షులతో, "మీ శాపానుసారం జయవిజయులు భూలోకంలో  దుష్ట దానవులుగా మూడు జన్మలెత్తి నా సాన్నిధ్యం చేరుకుంటారు" అని అన్నాడు. ఆ విధంగా కశ్యప మహర్షికి, అదితికి పుత్రులుగా హిరణ్యాక్ష,హిరణ్యకశిపులు జన్మించారు. కఠోర తపస్సు చేసి హిరణ్యకశిపుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొందాడు. ఎవరి వల్లా, ఏ ఆయుధంతో గాని, భూమ్యాకాశాలలో కానీ , పగటిపూట కాని , రాత్రిపూటకాని , దేవ దానవ,మానవ,జంతువుల వల్ల కానీ  తనకు మరణం కలుగరాదని వరాలు పొంది, ముల్లోకాలను తన వశం చేసుకున్నాడు. ఇక  హిరణ్యాక్షుడు కూడా అదే  బ్రహ్మని ప్రార్ధించి,  వరాలు పొంది దేవతలను బందీలుగా చేశాడు. ఈ సోదరుల దుష్టత్వం రోజు రోజుకి పెరిగి పోతూ వచ్చింది. హిరణ్యాక్షుడు గర్వమదాంధతతో వరుణభగవానుడితో తగవు పెట్టుకున్నాడు. దానికి
వరుణుడు " ఓ దానవా.. ఎక్కువగా మిడిసిపడకు. మహావిష్ణువు నీ అంతు చూడడానికి వరాహ రూపంలో అవతరించబోతున్నాడు" అని చెప్పడంతో హిరణ్యాక్షుడు వరాహస్వామి ని వెతుకుతూ అన్ని దిశలకు వెళ్ళాడు.
జలప్రళయం లో భూమి మునిగిపోయినందు వలన బ్రహ్మదేవుడు మహావిష్ణువు గురించి తపస్సు చేశాడు. అప్పుడు ఆయన శ్వాస నుండి ఆవిర్భవింఛిన ఒక చిన్న శ్వేత వరాహం మెల్లమెల్లగా పెరిగి బ్రహ్మాండమైన రూపం ధరించినది. ప్రళయంలో మునిగిన భూమిని బయటకు తీసుకురావడానికి సముద్రంలో దూకింది. ఇదే సమయంలో ఎక్కడ వెతికినా వరాహమూర్తి ఏకనిపించలేదని హిరణ్యాక్షుడు తన రాజ్యం చేరుకొని ఆనందంగా వున్నాడు. అప్పుడు నారదుడు అక్కడకు వచ్చి "హిరణ్యాక్షా.. మహావిష్ణువు వరాహ అవతారం దాల్చి, నీటిలోమునిగిన భూమిని పైకి తీసుకునివస్తున్నాడు. " అని చెప్పగా తక్షణమే గద తీసుకుని బయలుదేరాడు. హిరణ్యాక్షుడు , వరాహస్వామికి మధ్య భీకర యుధ్ధం జరిగింది. హిరణ్యాక్షుడు కొట్టిన దెబ్బకి మహావిష్ణువు చేతిలోని గద క్రింద పడినది. దేవతలు అదిరిపడ్డారు. హిరణ్యాక్షుడు తిరిగి తన గదతో మళ్ళీ కొట్టాడు. మహావిష్ణువు తమ ఎడంకాలితో దాన్ని తన్ని తమ చేతిలోకి చక్రాయుధాన్ని తీసుకున్నారు. హిరణ్యాక్షుడు శూలాయుధాన్ని వేశాడు. హరి చక్రాయుధంతో శూలాయుధం తునాతునకలయింది. హిరణ్యాక్షుడు ఆవేశంగా మహావిష్ణువు గుండెల మీదపడ్డాడు. వారిద్దరికి ఉగ్రంగా పోరాటం జరిగింది. హిరణ్యాక్షుని శక్తి సన్నగిల్లింది. ఆ దానవుడు  అదృశ్యమై ఆకాశం నుండి రాళ్ళ వర్షం, బాణాల వర్షం కురిపించ సాగాడు.  వరహస్వామి కొంచెం సేపు ఆ దానవుని శక్తిని  వేడుకగా చూశాడు. దానవులు చాలామంది హిరణ్యాక్షునికి తోడుగా వచ్చారు. వారినందరిని సంహరించాడు మహావిష్ణువు. ఇంక ఆలశ్యం చేయడం మంచిది కాదని హిరణ్యాక్షుని తల మీద  గట్టిగా మోది అతనని సంహారించాడు. ముల్లోకాలు మహావిష్ణువుని ఘనంగా కీర్తించాయి.  ఇదే మహావిష్ణువు యొక్క మూడవ అవతారమైన వరాహ అవతారం. 

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts