ప్రజా సమస్యలను గాలికొదిలేసిన అసమర్థత టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. శనివారం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెలుగోడు ప్రాజెక్టు నుంచి బ్రహ్మంసాగర్‌కు నీటిని పూర్తిస్థాయిలో నింపడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలుగోడు ప్రాజెక్టు నుంచి 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేవారని, ఆ సమయంలో బ్రహ్మంసాగర్‌కు 13టీఎంసీల నీటిని నింపినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు వెలుగోడుకు ప్రతిరోజు12 వేల క్యూసెక్కుల నీరు వస్తుందని,బ్రహ్మంసాగర్‌కు ఈ ఏడాదిలో 7 టీఎంసీల నీరు మాత్రమే టీడీపీ ప్రభుత్వం నిల్వ చేసిందన్నారు. బద్వేలు నియోజకవర్గంలో పెద్దచెరువుకు ఒక చుక్క నీటిని కూడా విడుదల చేయలేదన్నారు.వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే బ్రహ్మంసాగర్‌కు కుందూనది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా రూ.310 కోట్లతో నీరు నింపి రైతులను ఆదుకుంటామని ఆయన అన్నారు. వెలుగోడు నుంచి 18 కిలో మీటర్ల వరకు కాలువ లైనింగ్ దెబ్బతిన్నందని,అనేకమార్లు అధికారులకు సూచించినా టీడీపీ ప్రభుత్వం లైనింగ్ పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని వారు ఆరోపించారు. ఉల్లి,మిర్చి రైతులు కూలీలు కూడా రాక పంటను పొలాల్లోనే వదిలే శారని,పత్తిపంటకు గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ డీసీగోవిం దరెడ్డి,కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా,మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి,నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకట సుబ్బయ్య, వైసీపీ రైతు సంఘం అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి,వైసీపీ మున్సిపల్ నాయకులు కేశవరెడ్డి,సుందర్‌రామిరెడ్డి,వైసీపీ జిల్లా కార్యదర్శి గురుమోహన్ పాల్గొన్నారు.