YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఆగని ప్రైవేట్ దందా

ఆగని ప్రైవేట్ దందా

నల్గొండ, మే 14, 
సూర్యాపేట జిల్లాలోని ఆస్పత్రులకు కమీషన్ల రోగం పట్టుకుంది. కరోనా విపత్కర పరిస్థితులను అధికారులు క్యాష్ చేసుకుంటున్నారు. దీంతో జిల్లాలో కొవిడ్ బాధితుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వైద్యం అందక కరోనా బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో సౌకర్యాలు ఉన్నప్పటికీ కొందరు కరోనా రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. కరోనా రోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు.ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు రాజకీయ అండదండలు ఉండటంతో ఇష్టానుసారంగా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా డబ్బులు వసూలు చేయడమే ప్రధాన లక్ష్యంగా వైద్యం అందిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు గ్రామాల్లో ఆర్ఎంపీ డాక్టర్లు కొందరు కొరియర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల నుంచి కమీషన్లు తీసుకుని కరోనా వచ్చిన రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు సిఫార్సు చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు వసూలు చేస్తూ సాధారణ వైద్యం చేసి పరిస్థితి విషమిస్తే చేతులెత్తేస్తున్నారు. దీంతో చేసేదేమి లేక కరోనా రోగులు మళ్లీ ప్రభుత్వ దవాఖానాలకు వెళ్తే అక్కడ వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు.జిల్లాలో కొంత మంది వైద్యులు, సిబ్బంది తీరు వైద్య వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకువస్తోంది. ఇటీవల ఓ ప్రైవేటు దవాఖానలో రూ.1.5 లక్షల బిల్లు వేశారని.. అయినప్పటికీ కొవిడ్ బాధితుడు బ్రతకాలేదని వారి బంధువులు వాపోయారు. బిల్లు కట్టి మృతిదేహన్ని తీసుకెళ్లామని అనడoతో చేసేదేమీ లేక బిల్లు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లినట్టు సమాచారం

Related Posts