రాజమండ్రి
తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట ఉండూరు బ్రిడ్జి వద్ద గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి వస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ వెహికిల్ కు ఎస్కార్ట్ గా వెళ్లేందుకు బ్రిడ్జి సమీపంలో వేచి ఉన్న ఇద్దరు హైవే పెట్రోలింగ్ పోలీసుల పైకి ఒక లారీ దూసుకెళ్లింది. హెడ్ కానిస్టేబుల్ మెండి సత్యనారాయణ,హోమ్ గార్డు ఎన్. ఎస్.రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తిమ్మాపురం పీఎస్ లో పనిచేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.