హైదరాబాద్ మే 14
రష్యాకు చెందిన స్పుత్నిక వి వ్యాక్సిన్ డోసు ధరను రూ.995.40గా నిర్ణయించినట్లు శుక్రవారం వెల్లడించింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న టీకాలకు ఈ ధర ఉంటుందని, ఇండియాలో తయారయ్యే వాటికి తక్కువ ధర ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ల్యాండైన ఈ టీకా ఎమ్మార్పీని రూ.948గా నిర్ణయించగా.. దానికి 5 శాతం జీఎస్టీ కలిపితే ధర రూ.995.40 అవుతుంది. ఈ టీకా తొలి డోసును ఇప్పటికే హైదరాబాద్ వ్యక్తికి వేసినట్లు రెడ్డీస్ ల్యాబ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 1వ తేదీనే లక్షన్నర స్పుత్నిక్ వి టీకాలు హైదరాబాద్‌లో దిగిన విషయం తెలిసిందే. వచ్చే కొద్ది నెలల్లో మరిన్ని డోసులు దిగుమతి అవుతాయని, త్వరలోనే ఇండియాలోనూ ఈ వ్యాక్సిన్ తయారీ ప్రారంభిస్తామని చెప్పింది.