YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

విజయ పధంపై ప్రశంశల వర్షం

విజయ పధంపై ప్రశంశల వర్షం

 

విజయపథంలో దూసుకెళ్తున్న ‘భరత్ అనే నేను’ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఈ సినిమా చూసి చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో హీరో మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివతో కలిసి కేటీఆర్ ‘విజన్ ఫర్ బెటర్ టుమారో’ కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘భరత్ అనే నేను’ సినిమాలో ఆయనకు నచ్చి సీన్ల గురించి తెలిపారు. ‘‘మనల్ని ఎన్నుకున్న ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలనే సందేశం నాకు బాగా నచ్చింది. సినిమాలో ప్రస్తావించిన లోకల్‌ గవర్నెన్స్‌ అంశం కూడా నచ్చింది. త్వరలోనే సీఎం కేసీఆర్‌ దీనిని అమలు చేయబోతున్నారు. అలాగే విద్యా, వైద్యం అంశాలను చాలా చక్కగా వివరించారు. మీడియా ఏ రకంగా ప్రవరిస్తుందో కూడా చాలా బాగా చూపించారు. రోజు మేం పడుతున్న కూడా మీ సినిమాలో చూపినందుకు ధన్యవాదాలు’’ అని తెలిపారు.ప్రజలు ఊరుకోరు: ‘‘సినిమాలో మహేష్‌ సీఎం అవగానే ట్రాఫిక్‌ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా అలా చేస్తే ప్రజలు ఊరుకోరు. అది నాకు తెలుసు. అయితే, సినిమా చూసాకైనా కాస్త సిగ్గుపడి అలాంటి తప్పు చేయకుండా ఉంటే చాలు’’ అని అన్నారు.

ఇలాంటి సినిమాలు రావాలి: ‘‘మేము లేదా ప్రభుత్వ అధికారులు మంచి చెబితే ఎవరూ వినరు, అమలు చేయరు. కానీ, మీలాంటి స్టార్లు చెప్పే విషయాలు తప్పకుండా ప్రజలపై ప్రభావం చూపుతాయి. మంచి విషయాలు సినిమాల్లో చూపించడం ద్వారా మనం అలా ఉండాలనే భావం వారిలో కలిగే అవకాశం ఉంటుంది. అలాగని, సినిమా మొత్తం అలాగే ఉండాలని కోరడం లేదు. ‘భరత్ అనే నేను’ తరహాలోనే కమర్షియల్‌గా చూపింవచ్చు’’ అని కేటీఆర్ తెలిపారు. 

స్టాప్‌ డూయింగ్‌ నాన్సెన్స్‌ లైక్‌ దిస్‌: మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్ మా సినిమాను ప్రశంసించాడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు నా సినిమాలు చూసినా చాలా టెన్షన్ పడతాను. సినిమా ఆయనకు నచ్చితే బాగుందని చెప్పారు. లేకపోతే చెప్పరు. అయితే, ‘ఆగడు’ సినిమా చూసిన తర్వాత ఆయన ‘స్టాప్ డూయింగ్ నాన్సెన్స్ లైక్ దిస్’ అన్నారు. కేటీఆర్ అంత నిజాయతీగా ఉంటారు’’ అని అన్నారు

Related Posts