YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కన్నా దారెటు

కన్నా దారెటు

భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు.. అనే వార్తల మధ్యన అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు గుంటూరు జిల్లా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ. చికిత్స అనంతరం ఆయన నిన్న సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆ వెంటనే ఆయనకు పరామర్శలు మొదలయ్యాయి. మామూలుగా అయితే ఈ పరామర్శలు పెద్ద విశేషం కాదు కానీ, పార్టీ మారతారు అనే ఊహాగానాల మధ్యన కన్నాను పలువురు నేతలు పరామర్శించడం ఆసక్తిదాయకంగా మారింది.కన్నాను పరామర్శించిన నేతల్లో ముందున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. ఏపీ విభాగం బీజేపీ నేతలు సోము వీర్రాజు, మాజీ మంత్రి మాణిక్యాలరావులు కన్నాను పరామర్శించారు. అలాగే బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ కూడా కన్నాను ఫోన్లో పరామర్శించారట. పనిలో పనిగా భారతీయ జనతా పార్టీని వీడవద్దని కూడా ఈ నేతలు కన్నాను కోరారు అనే వార్తలు వస్తున్నాయి. పార్టీలోనే ఉండాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని వీరు భరోసా ఇచ్చారట.అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు దక్కే అవకాశాలు లేవనే స్పష్టత వచ్చాకా కన్నా ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని ఇది వరకూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల బుజ్జగింపులు కన్నాను ఆ పార్టీలోనే నిలుపుతాయా? అనేది సందేహమే.ఇక కన్నాను పరామర్శించిన వాళ్లలో కాంగ్రెస్ నేతలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కూడా కన్నాను పరామర్శించారు. ఈ పరామర్శల నేపథ్యంలో... తన రాజకీయ భవితవ్యంపై కన్నా ఏం ప్రకటిస్తారనేది ఆసక్తిదాయకంగా మారింది.

Related Posts