కడప
దేశంలోని పౌరులందరికి కేంద్ర ప్రభుత్వమే ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని, ఆక్సిజన్ దిగుమతి పై జి.ఎస్.టి రద్దు చేయాలని ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో కడప జిల్లా పోరుమామిళ్లలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి లు మాట్లాడుతూ దేశంలో కరోనా సెకండ్ వేవ్ లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో దేశ పౌరులందరికి కేంద్ర ప్రభుత్వమే ఉచిత వ్యాక్సిన్ అందించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే దేశంలో, రాష్ట్రంలో కోవిడ్ హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్ అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆక్సిజన్ నిలువలు లేకపోవడంతో విదేశాలనుండి దిగుమతి చేసుకుంటున్నారని, అయితే ఆక్సిజన్ దిగుమతిపై ప్రభుత్వం 12% జి.ఎస్.టి వసూలు చేస్తుందని ఇది చాలా దారుణమని, ఒకవైపు కరోనా తో ప్రజలు అల్లాడిపోతుంటే వారికి అండగా ఉండాల్సిన ప్రభుత్వం జి.ఎస్.టి పేరుతో ఇంకా ఇబ్బంది పెడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలపై పక్షపాత వైఖరి సరికాదని, కరోనా పేషేంట్స్ అందరికి బెడ్, ఆక్సిజన్ అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి మండల కేంద్రం లో ఐసోలేషన్ సెంటర్ ఏర్పారుచేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే వ్యాక్సిన్, ఆక్సిజన్ దిగుమతి పై జి.ఎస్.టి వసూలు వంటి విషయాలపై ఎస్.ఎఫ్.ఐ సుప్రీం కోర్ట్ జోక్యం కోరుతూ పిటిషన్ వేసామని తెలిపారు.