జెనీవా మే 15
భారత్‌లో ఉన్న కోవిడ్ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో అనేక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనర రీతిలో పెరుగుతున్నాయని, చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారని, మరణాలు కూడా అధికంగానే చోటుచేసుకుంటున్నట్లు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియేసిస్ తెలిపారు. ప్రపంచ దేశాలకు టెడ్రోస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మహమ్మారి సోకిన తొలి ఏడాది కన్నా.. రెండవ ఏడాది మరింత ప్రమాదకరంగా ఉంటుందని, మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆయన హెచ్చరించారు.