YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మాటలేనా... చేతల్లేవా

మాటలేనా... చేతల్లేవా

న్యూఢిల్లీ, మే 17, 
భారత్ లో కరోనా వైరస్ వేవ్ ఎక్కవగా ఉంది. అమెరికాను మించిపోయింది. గతంలో ఇతర దేశాలపై ట్రావెల్ బ్యాన్ ను భారత్ విధించింది. సెకండ్ వేవ్ లో మాత్రం భారత్ పై నే అనేక దేశాలు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి. భారత్ లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంలో హాలండ్, బ్రిటన్ వంటి దేశాలు కరోనా పరీక్షలు చేసిన తర్వాతే భారత్ నుంచి వచ్చిన వారిని తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి. పథ్నాలుగు రోజులు క్వారంటైన్ లో ఉండేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తొలిదశలో భారత్ లాక్ డౌన్ విధించడంతో కేసుల సంఖ్య తక్కువగా ఉంది. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ లో కరోనా వైరస్ కట్టడి సాధ్యం కాదని గతంలోనే వైద్య నిపుణులు హెచ్చరించారు. అయితే సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నా పాలకులు మాత్రం లాక్ డౌన్ దిశగా ఆలోచిచండం లేదు. దేశ ఆర్థిక పరిస్థిితి పై ఆందోళన చెందుతున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కూడా లాక్ డౌన్ చివరి అస్త్రంగా మాత్రమే ఉపయోగించాలని సూచిస్తుంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, కేరళ వంటి రాష్ట్రాల్లో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ ను కట్టడి చేసేందుక ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ, పాక్షిక లాక్ డౌన్ ల దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. అయినా సెకండ్ వేవ్ లో వైరస్ ను నియంత్రించడం సాధ్యం కావడం లేదు. మరో వైపు వ్యాక్సినేషన్ కొరత కూడా తీవ్రంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి.లాక్ డౌన్ ను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అదే పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపార సముదాయాలు బోసిపోయి కన్పిస్తున్నాయి. నిర్మాణ రంగంలోనూ పనులు నిలిచిపోయాయి. ఉపాధి కార్మికులు తిరిగి తమ సొంత ఊళ్లకు చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయినా భారత్ ప్రభుత్వం మాత్రం సెకండ్ వేవ్ సమయంలో ఎలాంటి ప్యాకేజీలు ప్రకటించలేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. మోదీ మాటలు తప్ప చేతల్లో ఏమీ కన్పించడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి

Related Posts