YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

వ్యూహాలతో అఖిలేష్ రెడీ

వ్యూహాలతో అఖిలేష్ రెడీ

లక్నో, మే 17, 
మజ్ వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ వచ్చే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఈసారి గెలుపు దిశగా పార్టీని నడిపించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన చేద్దామనుకున్న సైకిల్ యాత్రకు కరోనా కారణంగా బ్రేకులు పడ్డాయి. దీంతో పాటు ఆయన కూడా కరోనా బారిన పడ్డారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత అఖిలేష్ యాదవ్ జిల్లాల పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అఖిలేష్ యాదవ్ కు 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. మొత్తం 492 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ చిన్నా చితకా పార్టీలతో తప్ప పెద్ద పార్టీలతో పొత్తుకు సుముఖంగా లేరు. ఇప్పటికే బీఎస్పీ తాను ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. గత ఎన్నికల్లో చవిచూసిన అనుభవంతో అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ ను కూడా దరిచేర్చుకోని పరిస్థితి.ఈ పోటీ మధ్య తన పార్టీ విజయం ఖాయమని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవడమే ఆయన ముందున్న ప్రధాన కర్తవ్యం. అందుకోసమే త్వరలో జల్లాల వారీగా నేతలతో సమావేశమై నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయనున్నారని తెలిసింది. అన్ని పార్టీలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అఖిలేష్ యాదవ్ అభ్యర్థులను ఎంపిక చేస్తారంటున్నారు.మరోవైపు సొంత బాబాయి శివపాల్ యాదవ్ ను కూడా కలుపుకుని పోయే ప్రయత్నంలో అఖిలేష్ యాదవ్ ఉన్నారు. ఆయన పార్టీని సమాజ్ వాదీ పార్టీలో విలీనం చేయడమా? లేక ఆయనకు కొన్ని స్థానాలు కేటాయించడమా? అన్నదే డిసైడ్ కావాల్సి ఉంది. సమాజ్ వాదీ కి బలమైన యాదవ సామాజికవర్గంలో చీలిక రాకుండా అఖిలేష్ యాదవ్ బాబాయితో సంప్రదింపులు మొదలుపెట్టారని తెలిసింది. ఆయన కూడా సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద అఖిలేష్ యాదవ్ కు ఈసారి జరగబోయే ఎన్నికలు ప్రతిష్టాత్మకమనే చెప్పాలి.

Related Posts