YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పురరాజకీయం వేడెక్కింది

 పురరాజకీయం వేడెక్కింది

జిల్లాలో ఏకైక మున్సిపాలిటిగా పేరొందిన ఆదిలాబాద్‌ మున్సిపల్‌ రాజకీయం మళ్లీ ముదురుతోంది. గత కొన్నాళ్ల క్రితం మంత్రి జోగు రామ న్న, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రంగినేని మనిషా వర్గాలకుచెందిన కొందరు కౌన్సిలర్ల మధ్య సై అంటే సై అన్న వాతావరణం కనిపించిన విషయం అందరికి తెలిసిందే. అప్పట్లో ఈ ఇద్దరి అగ్రనేతల విభేదాలపై రాష్ట్ర స్థాయిలో కూడా చర్చ జరిగింది. దీంతో అధిష్ఠానం చొరవ తీసుకొని వారి మధ్య సఖ్యత కుదర్చడంతో మున్సిపల్‌ రాజకీయం సద్ద్దుమనిగింది. అప్పటి నుంచి వీరిద్దరు కలిసే ముందుకు సాగడం, కొందరు కిందిస్థాయి నేతలకు మిం గుడు పడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రంగినేని మనిషాపై అవిశ్వాసా తీర్మాణానికి పావులు కదుపడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా మున్సిపల్‌ సభ్యుల మధ్య వర్గ విభేధాలు తారా స్థాయికి చేరడంతో భారీ స్థాయిలో ముడుపులు ముట్ట చెప్పడంతోనే అంతా సైలెంట్‌ అపోయినట్లు అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి.

ఇటీవల పట్టణంలోని గణేష్‌ థియేటర్‌ లీజు వ్యవహారంలోనూ ఇరు వర్గాల సభ్యులు బాహాబాహికి దిగడం పట్టణం లో హాట్‌టాపిక్‌గా మారింది. అభివృద్ధి పనులను ఆశ చూపి కొందరు కౌన్సిలర్లను అధికార పార్టీలో చేర్చుకునప్పటికీ అనుకు న్నస్థాయిలో అభివృద్ధి జరుగక పోవడంతో వారే ప్రస్తుతం వ్యతిరేక గళం విప్పారు. వీరితో పాటు అధికార పార్టీలో గెలుపొందిన కౌన్సిలర్లు కూడా ఈ అగ్రనేతల తీరుపై అలక వహిస్తు తెరచాటున రాజకీయాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో 36మంది కౌన్సిల్‌ సభ్యులు గెలుపొందగా ఇం దులో కాంగ్రెస్‌ నుంచి-4, ఎంఐఎం-4, బీజేపీ-3 మంది గెలుపొందారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులను కలుపుకొని ప్రస్థుతం టీఆర్‌ఎ్‌సకు 25మంది సభ్యుల బలం ఉంది. కాని ఇందులో 30 మంది సభ్యులు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 15మంది సభ్యుల సంతకాలను సేకరించినట్లు ప్రచా రం. మే 3న కలెక్టర్‌ను కలిసి పరిస్థితిపై వివరిస్తూ ఫిర్యాదు చే సేందుకు సభ్యులు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మున్సిపల్‌ పాలక వర్గం కొలువుధీరినప్పటి నుంచి ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగలేదంటు ఆరోపణలు చేస్తూ కొందరు సభ్యులు తమ పంతం నెగ్గించుకునేందుకే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగానే ఆటంకాలు సృష్టించి లబ్ధి పొందేందుకే ప్రయత్నిస్తున్నారే తప్ప, అవిశ్వాస తీర్మాణం పై చిత్తశుద్ధి లేదన్న వాదనలు కూడా బలంగా వినబడుతున్నా యి. గతంలో రెండున్నరేళ్లకే స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మాణం పెట్టే అవకాశం ఉండేది. కాని తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ పరిమితిని నాలుగేళ్లకు పెంచారు. దీంతో ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ జూలై 3, 2018కి నాలుగేళ్లు పూర్తి చే సుకుంటుంది. అయితే గడువు సమయానికి రెండు మాసాల ముందే అవిశ్వాస తీర్మాణ అంశాన్ని సభ్యులు భుజానికెత్తుకోవ డంపై ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు సర్వత్రా వినబడుతున్నాయి. తాజాగా కొందరు సభ్యులు మంత్రి, చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాణం పెట్టేందుకు సాహసం చేయడం చర్చనీయాంశంగా మారుతోంది.

గత కొన్నాళ్ల క్రితం మంత్రి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మధ్య విభే ధాలు ఉండేవి. దీంతో మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు కూడా రెం డు వర్గాలుగా విడిపోయి వారి పంతం నెగ్గించుకున్నారు. కాని గత యేడాది నుంచి ఈ ఇద్దరు అగ్ర నేతలు ఒక్కటి కావడంతో కొందరు సభ్యులకు మింగుడు పడడం లేదు. అభివృద్ధి పనుల కు తాము సిఫార్సు చేసిన పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి క్రమంలోనే అవిశ్వాస తీర్మాణం అంశాన్ని తెరపైకి తెచ్చి ఇద్దరు అగ్రనేతలకు షాక్‌ ఇచ్చేందుకు సభ్యులు వ్యూహం పన్నుతున్నట్లు సమాచారం. మున్సిపల్‌ పూర్తి కాలం గడువుకు మరో యేడాది కాలమే మిగిలి ఉండడంతో ఇప్పట్లో అవిశ్వాస తీ ర్మాణం పెట్టిన అంతగా ప్రయోజనం ఉండదంటూ రాజకీయ వి శ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అది కూడా మంత్రి జోగురామన్న మాటను కాదని అవిశ్వాసానికి సిద్ధమైన ఫలితం లేద న్న వాదనలే బలంగా వినిపిస్తున్నాయి.

మున్సిపల్‌ పాలక వర్గంలో అధికార పార్టీ సభ్యుల మధ్యనే అంతర్గత విభేధాలు భగ్గుమంటున్నాయి. స్వపక్ష సభ్యులే విపక్ష గళం విప్పడంపై మున్సిపల్‌ పరిస్థితికి అద్దం పడుతుంది. మొదటి నుంచి సభ్యుల మధ్య వర్గ విభేధాలు కనిపిస్తునే ఉన్నాయి. అభివృద్ధి పనులు తమకు కేటాయించాలని ఒత్తిళ్లు చేస్తునప్పటి కి మంత్రి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లు సరైన రీతిలో స్పందించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల కారణంగానే వ్యతిరేకతను వ్యక్తం చేయాల్సి వస్తుందని కొందరు సభ్యు లు బహిరంగంగానే చెప్పడం గమనార్హం. ఇటీవల జిల్లా పర్యట న చేసిన రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మున్సిపాలిటికి రూ.28కోట్లు నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అ నుకున్నట్లుగానే నిధులు మంజూరు చేస్తూ జీవోను కూడా విడుదల చేశారు. గత నెల రోజుల క్రితమే పట్టణంలో చేపట్టే పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. వీటితో పాటు మిషన్‌ భగీరథ పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆయా వార్డుల్లో జరుగుతున్న పనులపై కొందరు సభ్యులు తమ వాటా ను కేటాయించాలని ఒత్తిడి తెచ్చిన పట్టించుకోక పోవడంతోనే ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుందంటున్నారు. ఒకే పార్టీలో కొనసాగుతున్న సభ్యుల్లోను ఐక్యత లేకపోవడం అధికార పార్టీకి పట్టణంలో మున్ముందు గడ్డుకాలమేనన్న అభిప్రాయాలు లేకపో లేదు. అయితే సభ్యుల అవిశ్వాస తీర్మాణ ఆలోచన తీరుపై అప్పుడే భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి.

Related Posts