YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చెక్ పోస్ట్ తనిఖీ చేసిన సిపి సత్యనారాయణ

చెక్ పోస్ట్ తనిఖీ చేసిన సిపి సత్యనారాయణ

ఆసిఫాబాద్
కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ని వాంకిడి పోలీసు చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి పరిస్థితిని పర్యవేక్షించిన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఇంచార్జి ఎస్పీ రామగుండం సిపి వి.సత్యనారాయణ
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో తాండూర్ చెక్ పోస్టు వద్ద పొరుగు రాష్ట్రాల, జిల్లాల నుండి వచ్చే వాహనాలు, వాహనదారుల తనిఖీ, తాజా పరిస్థితిని సీపీ  పర్యవేక్షించారు.
తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో విధించిన ఈ 10 రోజుల లాక్ డౌన్ గత 06 రోజుల నుండి పటిష్ఠంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు లాక్ డౌన్ మినహాయింపు సమయంలోనే ప్రయాణాలు కానీ ఏదైనా అవసరం ఉంటే చూసుకోవాలని 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితి లో బయటకు రాకూడదని అనవసరంగా ఇలాంటి కారణాలు లేకుండా బయటకు వచ్చినట్లయితే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.తప్పనిసరి చేసిన ఈ పాస్, కోవిడ్ రోగులు అయితే ఆసుపత్రి లెటర్ తో పాటు కోవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా జారీ చేయబడిన పాసులు ఉన్న వారినే అనుమతించడం,ఇతర జిల్లా ల నుండి నిత్యావసర వస్తువులు మినహా ఎలాంటి వాహనాలు అనుమతించవద్దని సిబ్బందికి ఆదేశించారు. నిబంధనలు పకడ్బందీ గా  అమలు చేయాలన్నారు. ప్రజలు కూడా సహకరించి నిబంధనలు తుచ తప్పకుండా పాటించాలన్నారు. చెక్ పోస్ట్ వద్ద పోలీస్ అధికారులతో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు పొరుగు రాష్ట్రాల, జిల్లాల నుండి తెలంగాణాలోకి వచ్చే వారు సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడవద్దని సీపీ  కోరారు.  సీపీ  వెంట ఎస్పీ వై వి ఎస్ సుధీంద్ర, డిఎస్పీ అచ్చేశ్వర్ రావు వాంకిడి సీఐ సుధాకర్, ఎస్ఐ రమేష్,ఇతర పోలీస్ అధికారులున్నారు.

Related Posts