YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రు దగ్గర అన్నపూర్ణ క్యాంటిన్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ప్రభుత్వ ఆసుపత్రు దగ్గర అన్నపూర్ణ క్యాంటిన్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఇంటింటికి ఫివర్ సర్వే జరుగుతుంది.9 లక్షల మందికి ఫివర్ టెస్ట్ లు చేసాం.ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర అన్నపూర్ణ క్యాంటిన్ లు ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం నాడు జీహెచ్ఎంసీ కార్యాలయంలో అయన కరోనా నిబంధలపై సమీక్ష జరిపారు. మంత్రి మాట్లాడుతూ  ప్రజల్లో చైతన్యం వచ్చింది.. .10 గంటలలోపు ఎవరి ఇంటికి వారు పోతున్నారు. లాక్ డౌన్ సమయంలో బోజనం పెడతామంటె ఎలా ఊరుకుంటాం. ప్రతిపక్షాలు ఇష్యూ చేయాలని చూస్తున్నారు. లాక్ డౌన్ టైమ్ కు లోబడి బోజనాలు పెడతామంటె ఎవరు వద్దంటుంన్నారని ప్రశ్నించారు. వీలైతే సహాయం చేయండి.. లేదంటే ఇంట్లో కూర్చోండి. ఇతర రాష్ట్రాల ఆంబులెన్స్ లు రాష్ట్రంలో లోకి రానివ్వడం లేదనేది అసలు ఇష్యూ నే కాదని అన్నారు.  కావాలని వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. బెడ్ లు రిజర్వ్ చేసుకున్న పేషెంట్స్ ను ఎక్కడ ఆపడం లేదు.కలెక్టర్ , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం.గత కొన్ని రోజులుగా కేసులు తగ్గుముఖం పట్టాయి.కేంద్ర ప్రభుత్వం ,కొన్ని స్వచ్ఛంద సంస్థల సహాకారం తీసుకుంటుంన్నాం.సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఈరోజు సాయంత్రానికి వస్తాయని అధికారులు చెప్తున్నారు. లాక్ డౌన్ పెట్టకపోతే పెట్టలేదు అన్నారు... లాక్ డౌన్ పెడితే  ఏంధుకు పెట్టారు అన్నారని అయన విమర్శించారు.

Related Posts