
విశాఖపట్నం
విశాఖ టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు ఎస్.రతన్కాంత్ మాట్లాడుతూ 10 తరగతి ఇంటర్ మీడియట్ విద్యార్థులకు పరీక్షలను విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ వేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని అన్నారు. నారా లోకేష్ టెన్త్ ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం మూర్ఖత్వం కాకపోతే మరేమిటి అని అన్నారు. మన రాష్ట్రంలో ఇప్పటివరకు పది లక్షల కరోనా కేసులు ఉన్నాయి. అలాగే 7500 కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. రోజుకు 20000 కేసులు నమోదవుతున్నాయి కరోనా కేసులు పెరుగుదలలో మన రాష్ట్రం ఐదో స్థానంలో ఉంది అన్నారు ఆసుపత్రిలో బెడ్లు ఆక్సిజన్ మందులు దొరకడం కాదు కనీసం శ్మశానవాటికలో దహనసంస్కారాలకు ఖాళీ లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండటం సిగ్గు చేటు అన్నారు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడానికి భయపడే మీరూ నేడు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు చేయడం అనేది సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు. కోవిడ్ 19 సెకండ్ వేవ్ లో చిన్నారులు విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు ఫస్ట్ వేవ్ లో 11 శాతం కేసులు నమోదు అయితే ప్రస్తుతం 20 నుంచి 40 శాతం కేసులు పెరిగాయి అన్నారు టెన్త్, ఇంటర్ పరీక్షలు ఆలస్యమైతే ఏమౌతుంది వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాతే నిర్వహించాలని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు తెలుగుదేశం పార్టీ లక్షలాది మంది ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల తరపున న్యాయపోరాటం చేస్తోంది అన్నారు . రాష్ట్రంలో గత రెండు రోజులుగా 29 మంది విద్యార్థులు కరోనాతో చనిపోయారు. ఇప్పటికే దాదాపు 150 మంది ఉపాధ్యాయులు చనిపోయారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి చలనం లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పది మరియు ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.