YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఇంకా వీడని కరెన్సీ కష్టాలు

 ఇంకా వీడని కరెన్సీ కష్టాలు

తెలుగు రాష్ట్రాల  ప్రజలను కరెన్సీ కష్టాలు చుట్టుముట్టాయి. డీమానిటైజేషన్ జరిగిన నాటి పరిస్థితులు  పునరావృతం అవుతున్నాయి. బ్యాంకులు డబ్బులు లేవంటూ చేతులెస్తుంటే... ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. తెలుగు రాష్రాలను కేంద్రం చిన్నచూపుచూస్తున్న వేళ... ఆర్బీఐ  అయితే మరో అడుగు ముందుకు వేసి దీనికి కారణం ప్రజలేనంటూ  కొత్త కథ చెపుతుంది. త్రాగునీటి కష్టాలు...చూసాం. సాగునీటి కష్టాలు..చూసాం. కానీ ఇప్పుడు అందరినీ కలవర పెట్టేందుకు కరెన్సీ కష్టం తరుముకొస్తుంది. తెలుగు రాష్టాల ప్రజలను ఎవరిని అడిగినా... ఎనోట విన్నా ఇదే మాట వినిపిస్తుంది.  కేంద్ర పాలకులు సైతం ఈ సమస్యను తీర్చలేక మీన మేషాలు లెక్కిస్తున్నారు. ప్రజలు బ్యాంకుల వద్దకు వెళ్ళినా.. నిరాశ తో తిరిగి రావాల్సిన పిరిస్ధితులు కనిపిస్తున్నాయి. తమ వద్ద డబ్బులేదంటూ బ్యాంకు అధికారులు  సమాధానం చెపుతుంటే భాధ తో బ్యాంకు నుండి బయటకు తిరిగి రావాల్సిని  వస్తుంది. బ్యాంకులలో డిపాజిట్లు చేసేవారి శాతం చాల తక్కువగా ఉందని... అందువల్ల  కరెన్సీ కష్టాలు ఎక్కువగా ఉన్నాయని వారు వాపోతున్నారు. బ్యాంకులకు అరకొరగా నగదు వస్తుండడంతో ఖాతాదారులకు కొద్దిమొత్తంలో ఇస్తూ సరిపెడుతున్నారు.  ఇప్పుడు ఏటీఎంల ఎదుట ఎప్పుడు చూసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. నగదు ఉన్న ఏటీఎంల ఎదుట బారులు తప్పడం లేదు. నగదు ఏటీఎంలలో జమచేసిన కొద్దిసేపటికే కాళి అయి పోతున్నాయి.  తీవ్రమైన కరెన్సీ కొరతతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోని  ప్రజలు   తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ నుంచే రాష్ర్టానికి కరెన్సీ కేటాయింపులు తక్కువగా ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.తమ రాష్టాల్లో నగదు కొరత ఉందని ప్రభుత్వాలు .. కేంద్రానికి స్పష్టం చేసినా .. స్పందన లేదు. ఏదో కొన్ని చోట్ల నగదుకు ఇబ్బంది ఉందని ... ఒక్కసారిగా ప్రజలు డబ్బులు డ్రా చేయడంతో ఏటీఎంలు ఖాళీ అయ్యాయని ఆర్ధిక శాక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన సమాధానం పై ఇప్పటికే త్రీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే రానురాను పరిస్థితి విషమించతోందని గమనించిన కేంద్రం.. పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకులకు వచ్చినంత నగదుకు బదులుగా కొత్త కరెస్సీని మద్రించి పంపిణీ చేశఆమని కేంద్రం చేతులు దులుపు కోవాలని చూస్తుంది.  ఇక ఆర్బీఐ మరో అడుగు ముందుకు వేసి.. అసలు మొత్తం తప్పు ప్రజలదేనని తేల్చేసింది. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుంటున్న ప్రజలు ... డిపాజిల్ చేయడంలేదని ఆర్బీఐ కొత్త పల్లవి అందుకుంది. సమస్యలు పరిష్కరించాల్సిన కేంద్రం ,ఆర్బీఐలు  ఒకరిపై ఒకరు బురదజల్లుకోవడం .. అందులో ప్రజలను ఇన్వాల్వ్ చేయడంపై  తీవ్ర స్ధాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ ప్రజలు తమ డబ్బును డ్రా చేసుకొని ఇళ్ళల్లో పెటుకున్నా.. అడిగే హాక్కు ఎవరికి లేదు. ఎందుకంటే ప్రజలను అలా చేసేలా కేంద్రం, బ్యాంకులు ప్రేరేపించాయి. బ్యాంకులో ఖాతా ఉండడమే  పాపమన్నట్లు ఆపన్ను.. ఈ పన్ను వేసి వారి నడ్డి విరచాలని చూశాయి. దీంతో తమ డబ్బును స్థిరాస్థులు—రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెడుతున్నారు. రిజిస్ట్రేషన్ తాలుకా డబ్బులు పోగా మిగిలిన లిక్విడ్ క్యాస్ ను ఖర్చులకు వాడుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తతం ఏర్పడ్డ నగదు కొరతను తీర్చేందుకు కేంద్రం పకడ్బందీ చర్యలు తీసుకోకుంటే పరిస్థితి దారుణంగా తయారవుతుందనడం లో  ఎటువంటి సందేహం లేదు. 

Related Posts