తిరుపతి
శేషాచలం కొండల్లో గుప్త నిధుల కోసం భారీ తవ్వకాలు జరిపిన విషయం వెలుగు చూసింది.ఏకంగా 80 అడుగుల సొరంగం తవ్వేశారు. తిరుపతి మంగళం రోడ్డులోని బి టి ఆర్ కాలనీ సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి సమీపంలోని శేషాచలం కొండల్లో కొత్త నిధుల కోసం భారీ సొరంగం తవ్వి ఘటన చర్చనీయాంశంగా మారింది.మంగళం రోడ్డు లోని బీటీఆర్ కాలనీ సమీప శేషాచలం కొండపైన కొంతమంది అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నారన్న స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అనుమానితులను ప్రశ్నించగా విషయం బయటకు వచ్చింది. పోలీసుల ప్రధాన నిందితుడు మంకు నాయుడు,తోపాటు మరో ఆరుగురు కూలీలును అదుపులోకి తీసుకున్నారు. స్వయంగా కొండపైకి ఎక్కి సొరంగాన్ని పరిశీలించారు పోలీసులు. కొండల్లో గుప్త నిధులు ఉన్నాయని ఓ స్వామిజీ చెప్పడంతో సోరంగం తవ్వినట్లు అంగీకరించాడు నిందితుడు మంకు నాయుడు. నిందితుడిని వెంటబెట్టుకుని సొరంగంను తనిఖీ చేసిన పోలీసులు ఆశ్చర్య పోయారు. కొండ లోపల 80 అడుగుల భారీ సొరంగాన్ని చూసి అవాక్కయ్యారు. నెలల కాలంగా రహస్యంగా సొరంగ తవ్వకం జరుగుతున్నట్టు గుర్తించారు.నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. పోలీసులు, అటవీ అధికారులు, టీటీడీ విజిలెన్స్ కన్నుగప్పి ఇంతటి భారీ సొరంగం ఎలా తవ్వారన్న అంశంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతొంది.