YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తౌక్తా ఎఫెక్ట్ రాయిని కొట్టిన నౌక... 270 మంది గల్లంతు

తౌక్తా ఎఫెక్ట్ రాయిని కొట్టిన నౌక... 270 మంది గల్లంతు

ముంబై, మే 17, 
అరేబియా సముద్రంలో ఏర్పడిన తాక్టే పెను తుఫానుకు మహారాష్ట్ర, గుజరాత్ సహా ఐదు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ప్రస్తుతం గుజరాత్ తీరంవైపు పయనిస్తోన్న ఈ తుఫాను.. సోమవారం రాత్రికి తీరం తాకే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో పెను తుఫానుగానే కొనసాగుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. పోరుబందర్-మహువా వద్ద రాత్రి 8.30 గంటల సమయంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. రాత్రి 8 గంటలకు తుఫాను తీరం దాటనుండటంతో లోతట్టు ప్రాంతాల నుంచి లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కర్ణాటకలో తుఫాను విలయం కొనసాగుతోంది. ఏడు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టికి ఈదురు గాలులు తోడవడంతో భారీ వృక్షాలు నేలకొరుగుతున్నాయి. అటు, కేరళలోని తొమ్మిది జిల్లాల్లోనూ తౌక్టే తీవ్రత కొనసాగుతోంది. మహారాష్ట్రలో తౌక్టే ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఉదయం 11 గంటల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందన ముందుజాగ్రత్త చర్యగా విమానాల రాకపోకలను నిలిపివేశారు.భారీ వర్షంతోపాటు గాలులు వీస్తుండటంతో సోమవారం మోనోరైలు సర్వీసులను నిలిపివేశారు. భారీవర్షం వల్ల బాంద్రా-వర్లీ సీ లింక్‌ను మూసివేస్తున్నట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రావద్దని మున్సిపల్ అధికారులు సూచించారు.తౌక్టే ప్రభావంతో వీస్తున్న ప్రచండ గాలులకు ముంబయి తీరంలో ఓ వాణిజ్య నౌక రాయిని ఢీకొట్టింది. నౌక ప్రమాదానికి గురికావడంతో అందులోని 270 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వీరి కోసం కోస్ట్‌గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఐఎన్ఎస్ కొచ్చి సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెను గాలులు వీస్తున్నాయి=
 

Related Posts