YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

బిల్ గేట్స్ రాజీనామా వెనుక రాసలీలలే

బిల్ గేట్స్ రాజీనామా వెనుక రాసలీలలే

న్యూయార్క్, మే 17, 
మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ విడాకులు వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నట్టు బిల్ గేట్స్, ఆయన సతీమణి మిలిండా గేట్స్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, 2019లోనే విడాకుల కోసం న్యాయవాదిని మిలిండా గేట్స్ సంప్రదించారనే విషయం బయటకు వచ్చింది. లైంగిక నేరాల్లో దోషిగా తేలి, పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్‌ సాన్నిహిత్యమే విడాకులకు కారణమని ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉండగా ఓ ఉద్యోగితో సంబంధమే బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ బాధ్యతలు నుంచి తప్పుకున్నట్టు తాజాగా బయటకు వచ్చింది. దీని మైక్రోసాఫ్ట్ విచారణ జరిపినట్టు వెల్లడయ్యింది. ఆ ఉద్యోగితో బిల్ గేట్స్ సంబంధంపై న్యాయపరమైన సహకారంతో విచారణ జరిపించాం.. గేట్స్ పదవీవిరమణ చేసినందున దర్యాప్తుపై ఒక నిర్ణయానికి రాలేదని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ‘‘బిల్ గేట్స్ 2000 సంవత్సరంలో కంపెనీ ఉద్యోగితో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించినట్టు 2019 ద్వితీయార్ధంలో మైక్రోసాఫ్ట్ దృష్టికి వచ్చింది’’అని ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.ప్రయివేట్ న్యాయ సంస్థ సహకారంతో సమగ్ర దర్యాప్తు జరిపేందుకు బోర్డు కమిటీ సమీక్షించింది. దర్యాప్తు సమయంలో ఆందోళన వ్యక్తం చేసిన ఉద్యోగికి మైక్రోసాఫ్ట్ విస్తృతమైన సహాయాన్ని అందించింది’’ అని వ్యాఖ్యానించింది. మహిళా ఉద్యోగితో గేట్స్ సంబంధాలను మైక్రోసాఫ్ట్ డైరెక్టర్లు గుర్తించారని, ఈ విషయం తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ బోర్డు నుంచి వైదొలగాలని గత ఏడాది నిర్ణయించినట్లు డౌ జోన్స్ ఇంతకు ముందే నివేదించింది. అయితే, విచారణ గురించి మైక్రోసాఫ్ట్ పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.మైక్రోసాఫ్ట్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు బిల్ గేట్ గతేడాది మార్చిలో ప్రకటించారు. ఇకపై సేవా కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తానని అప్పట్లో ప్రకటించారు. అయితే, సంస్థ బాధ్యతల నుంచి గేట్స్ తప్పుకోవడం వెనుక సహోద్యోగితో లైంగిక అనుబంధం కారణం కాదని ఆయన అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ వ్యవహారం దాదాపు 20 ఏళ్ల కిందటదని, అది స్నేహపూర్వకంగా ముగిసిందని వ్యాఖ్యానించారు.మీటూ ఉద్యమం సమయంలో మైక్రోసాఫ్ట్‌లో మహిళా ఉద్యోగుల భద్రతపై విస్తృత చర్చ జరిగింది. 2000 నుంచి మైక్రోసాఫ్ట్‌లో వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. వాటిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో లోపాలను సరిచేసింది. కాగా, ఇంటెల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రియాన్ క్రజానిచ్ తనకు సహోద్యోగితో లైంగిక సంబంధం ఉందని బోర్డుకు సమాచారం ఇవ్వడంతో ఆయన రాజీనామా చేశారు. సీఈఓ పదవి చేపట్టడానికి చాలా సంవత్సరాల ముందే ఆ సంబంధం ముగిసిపోయినా ఆయన తప్పుకున్నారు. ఇలాంటి చర్యలు సంస్థ నిబంధనలకు విరుద్ధమని ఇంటెల్ జూన్ 2018లో ప్రకటన చేసింది.
 

Related Posts