తిరుమల
తిరుమలలో భక్తులకు తిరునామాలు దిద్ది జీవనం గడిపిన శ్రీనివాసాచారి అనే వ్యక్తి ఏడాది క్రితం మరణించాడు. తిరుమల వాసి కావడంతో మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఇల్లు కోల్పోవడంతో అతనికి శేషాచల నగర్లో టిటిడి క్వార్టర్స్ ఇచ్చింది .అయితే శ్రీనివాసాచారి ఎవరూ లేని అనాధ కావడంతో అతను చనిపోయే ఏడాది గడుస్తున్నా క్వార్టర్స్ గది తాళం మాత్రం ఎవరు తీయలేదు . ఆ గదిని స్వాధీనం చేసుకోవడానికి టిటిడి సిబ్బంది ఈరోజు వెళ్లి తాళం పగులగొట్టి లోనికి వెళ్లారు. వారికి అక్కడ అ ట్రంకు పెట్టె లోనూ ఇతరచోట్ల లడ్డూ కవర్లలో నోట్లకట్టలు కనిపించడంతో ఆశ్చర్యపోయారు. 10 ,20, 50 ఇలా వివిధ నోట్లను లెక్కకడితే దాదాపు ఆరున్నర లక్షల దాకా తేలింది. ఇప్పుడు ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది