విశాఖపట్నం
కరోనా చికిత్సలో వాడే ఇంజెక్షన్లను ఎంఆర్పీ కంటే అధికధరకు విక్రయి స్తున్న ఇద్దరిని విశాఖ డ్రగ్ కంట్రోల్, విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. విశాఖ నగరంలో మెడికల్ రిప్రజెంటే టివ్గా పనిచేస్తున్న దాడి ప్రసన్నకు మార్.. ఎస్.రమ్యకృష్ణ అనే అమ్మాయితో కలిసి కరోనా చికిత్సకు ఉపయోగించే బెవాసిజుమాబ్ ఇంజక్షన్లు విక్రయిస్తున్నాడు. వైద్యులు తొసిలిజుమాబ్ ఇంజక్షన్లు రాస్తుండగా.. అవి మార్కెట్లో దొరకడం లేదు. దానికి ప్రత్యామ్నాయంగా ఇది పనిచేస్తుందని చెప్పి వీరు బెవాసిజుమాబ్ విక్రయిస్తున్నారు. బెవాసిజుమాబ్ ఎంఆర్పీ 49 వేలు కాగా దాన్ని 75 వేలు చొప్పున అమ్ముతున్నారు. సమాచారం తెలుసుకున్న విజిలెన్స్, డ్రగ్ కంట్రోల్ అధికారులు రోగి తరఫు కుటుంబసభ్యుల్లా మాట్లాడి, రెండు ఇంజక్షన్లు రూ.1.5 లక్షలకు కొనడానికి ఒప్పందం చేసుకున్నారు. నగరంలోని శాంతిపురం వద్దకు వస్తే ఇంజక్షన్లు ఇస్తామని వారు చెప్పగా అధికారులు వెళ్లి వారిని పట్టుకున్నారు.