YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

హానికారిక ఆక్సిటోసిన్ హార్మోన్ అమ్మకాలఫై కేంద్రం నిషేదం

హానికారిక ఆక్సిటోసిన్ హార్మోన్ అమ్మకాలఫై కేంద్రం నిషేదం

హానికారిక ఆక్సిటోసిన్ హార్మోన్ దిగుమతితోపాటు వీటి కౌంటర్లలో అమ్మకాలను నిషేధిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.బాలికలను వేశ్యలుగా మార్చేందుకు వీలుగా వారు త్వరగా ఎదిగేందుకు ఆక్సిటోసిన్ ను వినియోగిస్తున్నారు. దీంతోపాటు పశువులకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇవ్వడం ద్వార పాల ఉత్పత్తిని పెంచేందుకు వాడుతున్నారు. అసలు ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ను గర్భిణికి ప్రసవవేదన సమయంలో త్వరగా కాన్పు అయ్యేందుకు వైద్యులు ఇస్తుంటారు. కాని దీనిపై నియంత్రణ లేకపోవడంతో అక్రమంగా వినియోగిస్తున్నారు. దీంతో ఆక్సిటోసిన్ హార్మోన్ ఉత్పత్తి, విక్రయాలపై ఆంక్షలు విధించాలని ఔషధ సాంకేతిక సలహా సంఘం కేంద్రానికి సిఫార్సు చేసింది. దీంతో ఆక్సిటోసిన్ ను అక్రమంగా వినియోగించకుండా నిషేధం విధించేలా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. ఆక్సిటోసిన్ తయారీ, విక్రయాలను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్టు కంట్రోల్ ఆర్గనైజేషన్ నియంత్రించాలని కేంద్రం ఆదేశించింది. ఆక్సిటోసిన్ ను అక్రమంగా తయారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయించినా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాది జులై నుంచి ఆక్సిటోసిన్ ను ప్రసూతి సమయంలో కాకుండా ఇతర కార్యక్రమాలకు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ హెచ్చరించింది.

Related Posts