YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, కార్పొరేషన్ అవినీతిపై ప్రమాణానికి సిద్ధమే

ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, కార్పొరేషన్ అవినీతిపై ప్రమాణానికి సిద్ధమే

నెల్లూరు
నెల్లూరులో టీడీపీ సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మీడియాతో మాట్లాడారు.   ప్రభుత్వ ఆసుపత్రిలో  50.పడకలు పెంచడం శుభపరిణామం.. కలెక్టర్ కు ధన్యవాదాలని అన్నారు.   థర్డ్ వేవ్ ప్రమాదభరితంగా రాబోతుంది.. మరో 300 పడకలు ఏర్పాటు చేయాలి.  వెంటిలిటర్లు లేక ఒకే రోజు 84 మంది చనిపోయారు.. మరో 300 ఆక్సిజన్ బెడ్లు, 200 వెంటిలిటర్లు పెంచండి. ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. పేదలు చనిపోతున్నారు. థర్డ్ వేవ్ మీద ముందుగానే అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం ఫెయిల్ అయింది. కలెక్టర్ అయినా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇద్దరు మంత్రులు ఉన్నా లేనట్టే.. రోగులను పై ఫ్లోర్ కి తీసుకెళ్లేందుకు లిఫ్టులు కూడా బాగు చెయ్యలేరా. ఆక్సిజన్ అందక ఒకే కుటుంభంలో ముగ్గురు, నెల్లూరు లో మరో ఫ్యామిలీ వెంటిలిటర్లు లేక చనిపోయారు. సోనుసూద్కి ఉన్న తెగువ మంచితనం మంత్రులకు లెవు. ఆస్తులు అమ్మి రాజకీయాలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ఓ నేత.. ఆక్సిజన్ యూనిట్ పేటెందుకే డబ్బులు పెట్టలేరా.? పవిత్రమైన శానసమండలిలో జిప్ విప్పిన సంస్కారహిణుడు మంత్రి అనీల్. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు, పక్కన పెట్టుకున్న జగన్ జైల్ కు వెళ్లాడు.. సంతోషంగా తిరుగుతున్న ఆనం వివేకా చనిపోయారు. మంత్రి అయ్యాక పాపికొండలో బోటు తిరగబడి పదుల సంఖ్యలో చనిపోయారు. నెల్లూరులో   లక్షల మంది బయటికి వచ్చేందుకు భయపడుతూ ఉన్నారు. చీకట్లో బెట్టింగ్ లు చేసుకుని బతికే నాయకులు నన్ను బెదిరించాలని చూస్తారా. సముద్రంలో అలలు లాంటోడ్ని నేను.. నాతో పెట్టుకోవద్దు. ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, కార్పొరేషన్ లో జరిగిన అవినీతిపై ప్రమాణానికి సిద్ధమే.  మంత్రిపై చేసిన ప్రతి ఆరోపణకు నేను సిద్ధంగానే ఉన్నానని అన్నారు.
 

Related Posts