YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

హౌస్ స‌ర్జ‌న్, పీజీ వైద్యుల‌ స్టైఫండ్ 15 శాతం పెంపు... తెలంగాణ‌ ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం

హౌస్ స‌ర్జ‌న్, పీజీ వైద్యుల‌ స్టైఫండ్ 15 శాతం పెంపు...  తెలంగాణ‌ ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం

హైద‌రాబాద్ మే 18
తెలంగాణ‌లోని హౌస్ స‌ర్జ‌న్లు, పీజీ వైద్యుల‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం తీపి క‌బురు అందించింది. హౌస్ స‌ర్జ‌న్, పీజీ వైద్యుల‌ స్టైఫండ్ 15 శాతం పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ మేర‌కు హెల్త్ సెక్ర‌ట‌రీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయ‌గా, వైద్యారోగ్య శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.స్నేహ సోమారెడ్డి అనే వైద్యురాలు ఇవాళ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. సార్ క‌రోనా క‌ష్‌‌కాలంలో మీరు ఎంద‌రికో స‌హాయం చేసుకున్నారు. కానీ రెసిడెంట్ డాక్ట‌ర్లు క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ ఆస్ప‌త్రుల్లో నిరంత‌రం సేవ‌లందిస్తున్నారు. గ‌త నాలుగు నెల‌ల నుంచి త‌మ‌కు జీతాలు అంద‌డం లేదు. కొవిడ్ డ్యూటీల‌కు హాజ‌రైన వారికి ఇతర రాష్‌ర్టాల్లో ప్రోత్స‌హ‌కాలు ఇస్తున్నారు. అలాంటివి కూడా త‌మ‌కు అంద‌డం లేదు. త‌మ ప్రాణాల‌ను ఫ‌ణంగా పెడుతున్నాం. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తాము ఎలా వ‌ర్క్ చేయ‌గలం సార్ ట్వీట్ చేశారు.

Related Posts