YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

స‌హ‌జీవ‌నం సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదు... పంజాబ్‌, హర్యానా హైకోర్టు కీల‌క‌ వ్యాఖ్యలు

స‌హ‌జీవ‌నం సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదు...  పంజాబ్‌, హర్యానా హైకోర్టు కీల‌క‌ వ్యాఖ్యలు

చండీగ‌ఢ్‌ మే 18 
స‌హ‌జీవ‌నం (లివ్‌ ఇన్‌ రిలేన్‌షిప్‌) పై పంజాబ్‌, హర్యానా హైకోర్టు కీల‌క‌ వ్యాఖ్యలు చేసింది. స‌హ‌జీవ‌నం అనే ఈ బంధం సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేసింది. ప్రేమించుకుని ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పంజాబ్‌, హ‌ర్యానా హైకోర్టులో పిటిష‌న్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జ‌రిపిన న్యాయ‌స్థానం స‌హ‌జీనంపై పై వ్యాఖ్య‌లు చేసింది.గుల్జా కుమారి (19), గురువిందర్‌ సింగ్ (22) పంజాబ్‌లోని తార్న్ తరన్ జిల్లాకు చెందిన వారు. ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు. అయితే గుల్జాకుమారి త‌ల్లిదండ్రులు వారి వివాహానికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వారు ఇండ్ల నుంచి పారిపోయి స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. గుల్జాకుమారి త‌ల్లిదండ్రుల నుంచి త‌మ‌కు ప్రాణ‌హాని ఉందంటూ ఇటీవ‌ల వారు కోర్టును ఆశ్ర‌యించారు.

Related Posts