YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

150 కోట్ల క్లబ్ లో భరత్ అను నేను

150 కోట్ల క్లబ్ లో భరత్ అను నేను

మహేశ్ బాబు హీరోగా ఈ నెల 20వ తేదీన 'భరత్ అనే నేను' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యూత్ తో పాటు మాస్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్లకు రప్పించింది. దాంతో తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ను రాబట్టి రికార్డు సృష్టించింది.ఇక వారం రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 73.9 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందనేది తాజా సమాచారం. అమెరికాలో 3 మిలియన్ డాలర్లకి పైగా రాబట్టిన ఈ సినిమా, ఆస్ట్రేలియా . . న్యూజిలాండ్ లోను భారీ వసూళ్లను రాబడుతున్నట్టుగా చెబుతున్నారు. కొరటాల శివ స్క్రీన్ ప్లే .. మహేశ్ బాబును ఆయన చూపించిన విధానం .. మహేశ్ నటన .. కైరా అద్వాని గ్లామర్ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు వచ్చేలా చేయడంలో ప్రధానమైన పాత్రను పోషించాయని చెబుతున్నారు.    

Related Posts